ETV Bharat / city

'కరోనా బాధితులకు వైద్యం నిరాకరిస్తే.... ఆస్పత్రి అనుమతి రద్దు' - cm jagan quarantine centers

రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పరీక్షల ఫలితాలు ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలని, ఒక ఎస్‌ఓపీ ప్రకారం పరీక్షలు, ఫలితాలు ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. పరీక్షలు చేయడంలో ప్రొటోకాల్ తప్పక పాటించాలని సూచించారు. కరోనా బాధితులకు వైద్యం నిరాకరించిన ఆస్పత్రుల అనుమతులను రద్దు చేయాలని సీఎం ఆదేశించారు. కరోనాతో మరణించిన వారి అంత్యక్రియల కోసం రూ.15 వేలు ఇవ్వాలని నిర్ణయించిన సీఎం.. వెంటనే ఆదేశాలు జారీచేయాలని సూచించారు. క్వారంటైన్ కేంద్రాలు, ఆస్పత్రుల్లో మెరుగైన సేవలు అందించేలా ప్రత్యేక డ్రైవ్ లు చేయాలని అధికారులను ఆదేశించారు.

cm-jagan
cm-jagancm-jagan
author img

By

Published : Jul 14, 2020, 8:00 PM IST

Updated : Jul 14, 2020, 9:54 PM IST

కరోనా నివారణ చర్యలపై సీఎం జగన్‌ సమీక్షించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ నీలం సాహ్నీ, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌ జవహర్‌రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కొవిడ్‌19 పరీక్షలు, కేసుల వివరాలను సమావేశంలో అధికారులు వెల్లడించారు. కరోనా పరీక్ష ఫలితాలు ఆలస్యంగా రావడం, కొన్ని జిల్లాల్లో నమూనాలు పెద్ద సంఖ్యలో వృథా అవ్వడంపై సమావేశంలో చర్చించారు. కరోనా టెస్టులు ఒక ఎస్‌ఓపీ ప్రకారం చేయాలన్న సీఎం ఆదేశించారు. ఎవరికి పరీక్షలు చేయాలనే విషయంపై స్పష్టమైన ప్రోటోకాల్‌ ఉండాలని నిర్దేశించారు. టెస్టులు చేయాల్సిన వారి కేటగిరీలను స్పష్టంగా తెలిపాలని సీఎం సూచించారు. కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవడానికి శాశ్వత కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

వైద్యం నిరాకరిస్తే కఠిన చర్యలు

కంటైన్‌మెంట్‌ ప్రాంతాల్లో కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ చేయడానికి ప్రత్యేక బస్సులను వినియోగించి పరీక్షలు చేస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. అలాగే హైరిస్క్‌ క్లస్టర్లలో కూడా ఆ బస్సుల ద్వారా పరీక్షలు చేసి కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ చేస్తున్నామన్నారు. టెస్టుల్లో నెగెటివ్‌ వచ్చినా సరే.. ఎక్స్‌రేలో విభిన్నంగా కనిపిస్తే పాజిటివ్‌గా పరిగణిస్తూ వైద్యం అందిస్తున్నామని వివరించారు. పాజిటివ్‌గా తేలిన వారు ఆలస్యంగా ఆస్పత్రికి వస్తుండడంతో మరణాలు సంభవిస్తున్నాయని, అందుకే వాటిని తగ్గించడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్న అధికారులు వివరించారు. కరోనా కేసుగా భావించి పలు ప్రైవేటు వైద్యశాలలు చికిత్సకు నిరాకరించడంతో ప్రజలు ప్రాణాలు కోల్పోయిన వైనం సమావేశంలో చర్చకు వచ్చింది. కరోనా కేసు వస్తే ఏ ఆస్పత్రి వైద్యానికి నిరాకరించకూడదని సీఎం స్పష్టం చేశారు. వైద్యానికి నిరాకరిస్తే కఠినంగా వ్యవహరిస్తామని, అనుమతులు రద్దు చేస్తామన్నారు. ఆ మేరకు కఠినంగా వ్యవహరించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

అంత్యక్రియలకు ఆర్థిక సాయం

కరోనాతో చనిపోయిన వ్యక్తుల అంత్యక్రియలు చేయడంలో జరుగుతున్న కొన్ని అమానవీయ ఘటనలపైనా సీఎం చర్చించారు. కరోనాతో మరణించిన వారి అంత్యక్రియలకు రూ.15 వేలు సాయం అందించాలని సీఎం ఆదేశించారు. ఇటీవల చోటు చేసుకున్న ఘటనల దృష్ట్యా ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ మేరకు తక్షణం చర్యలు తీసుకుని వెంటనే ఆదేశాలివ్వాలన్నారు. కొవిడ్‌ ఆస్పత్రుల్లో వైద్య సేవలపై దృష్టి పెట్టాలని..జీఎంపీ ప్రమాణాలున్న మందులు అందించాలన్నారు. రానున్న కాలంలో అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరిన్ని సదుపాయాలు కల్పించాలని సీఎం ఆదేశించారు. సేవల్లో నాణ్యత అనేది చాలా ముఖ్యమైనదని స్పష్టం చేసిన సీఎం... రాష్ట్ర వ్యాప్తంగా క్వారంటైన్‌ కేంద్రాలు, ఆస్పత్రుల్లో మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు.

క్వారంటైన్ సదుపాయాలపై దృష్టి పెట్టండి

ఫిర్యాదుల స్వీకరణకు ఆయా కేంద్రాల వద్ద కాల్‌ సెంటర్‌ నంబర్‌తో హోర్డింగ్‌ ఏర్పాటు చేయాలన్నారు. ఫీడ్‌బ్యాక్‌ కోసం ప్రతిరోజూ ప్రతి క్వారంటైన్‌ సెంటర్, ఆస్పత్రికి కనీసం 3 సార్లు ఫోన్ కాల్స్‌ చేయాలని సూచించారు. పారిశుద్ధ్యం, భోజనం, సదుపాయాలపై దృష్టి పెట్టాలన్న సీఎం.. వచ్చే 7 రోజులు ప్రత్యేక డ్రైవ్‌ చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. కొవిడ్‌ కేర్‌ సెంటర్లు, కొవిడ్‌ ఆస్పత్రులు, క్వారంటైన్‌ సెంటర్లలో నాణ్యతపై దృష్టిపెట్టని అధికారులకు నోటీసులు జారీ చేయాలన్నారు. కొవిడ్‌ వైరస్‌ వ్యాప్తి, భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సన్నద్ధం కావాలని అధికారులను సీఎం సూచించారు. వైద్యులు, నర్సులకు సంబంధించి అనుసరిస్తున్న ప్రణాళికను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే వైద్యులు, నర్సులు, ఇతర వైద్యసిబ్బంది డేటాబేస్‌ సిద్ధం చేశామని, కనీసం 17 వేలకు పైగా వైద్యులు, 12 వేలకు పైగా నర్సుల సేవలు పొందేందుకు ప్రణాళిక రూపొందించినట్లు అధికారులు తెలిపారు. విపత్తు సమయంలో వారు సేవలందిస్తున్నందున వారికి మెరుగైన జీతాలు ఇవ్వాలని సీఎం సూచించారు.

ఇదీ చదవండి : భాజపా నేతపై హత్యాయత్నం... సమగ్ర విచారణకు పవన్ డిమాండ్

Last Updated : Jul 14, 2020, 9:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.