కరోనా నివారణ చర్యలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. కరోనా బాధితుల పట్ల వివక్ష చూపడం సరికాదన్నారు. వైరస్ పట్ల ప్రజల్లో భయం, ఆందోళన తొలగించాల్సిన అవసరం ఉందని తెలిపారు. కరోనాకు చికిత్స చేయించుకునేందుకు బాధితులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నిన్న జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో కీలక అంశాలు ప్రస్తావించనని.. మోదీ అన్నారని అధికారులకు సీఎం తెలిపారు.
నిన్న ఒక్కరోజే 10,730 పరీక్షలు చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటివరకు 1,91,874 పరీక్షలు చేశామని వివరించారు. రాష్ట్రంలోని 4 జిల్లాలపై కోయంబేడు మార్కెట్ ప్రభావం చూపుతోందన్నారు.
'ధాన్యం సేకరణను ముమ్మరం చేయాలి. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా చూడాలి. చేపలు, రొయ్యల ఎగుమతులపై కూడా దృష్టి పెట్టాలి.'
- ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి