ETV Bharat / city

రాష్ట్రంలో మూడోసారి కుటుంబ సర్వే: సీఎం జగన్ - సీఎం జగన్ సమీక్ష వార్తలు

కరోనా నివారణ చర్యలపై సీఎం జగన్ అధికారులు, మంత్రులతో సమీక్షించారు. రాష్ట్రంలో మూడోసారి సమగ్ర కుటుంబ సర్వే జరపాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఆస్పత్రిలో ఐసొలేషన్‌ వార్డు ఏర్పాటుపై సీఎం సమీక్షించారు. వ్యవసాయంపై కరోనా ప్రభావం, రైతుల కోసం తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. ఈ సమావేశంలో మంత్రులు ఆళ్ల నాని, కన్నబాబు, సీఎస్‌, డీజీపీ, అధికారులు పాల్గొన్నారు.

cm-jagan-review-on-corona-in-ap
cm-jagan-review-on-corona-in-ap
author img

By

Published : Apr 9, 2020, 5:55 PM IST

కరోనా నివారణ చర్యలపై ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి సమీక్షించారు. కరోనా నివారణ అధ్యయన వివరాలను ప్రభుత్వ సలహాదారు శ్రీనాథ్‌రెడ్డి ముఖ్యమంత్రికి అందించారు. కరోనా విస్తరణ స్థితిగతులు, నివారణ చర్యలపై సీఎం అధికారులతో చర్చించారు. ఉదయం 9 వరకు ఒక్క పాజిటివ్‌ కేసూ నమోదు కాలేదన్న అధికారులు.. దిల్లీ వెళ్లినవారు, వారిని కలిసినవారి వల్లే కేసులు పెరిగాయని ముఖ్యమంత్రికి వివరించారు. వీరికి చేసే పరీక్షలు పూర్తవుతున్న కొద్దీ కేసుల సంఖ్య తగ్గుతుందని తెలిపారు.

  • మూడోసారి సమగ్ర కుటుంబ సర్వే జరగాలి: జగన్

రాష్ట్రంలో మూడోసారి సమగ్ర కుటుంబసర్వే జరగాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితిపై సర్వేచేసి వివరాలు నమోదు చేయాలని తెలిపారు. రియల్‌టైం పద్ధతిలో ఎప్పటికప్పుడు సమాచారం నమోదు చేస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. వైరస్‌ లక్షణాలు ఉన్నట్లు గుర్తించిన అందరికీ పరీక్షలు చేయాలని సీఎం సూచించారు. పొరపాట్లు జరిగేందుకు అవకాశం లేకుండా ప్రక్రియ కొనసాగాలన్నారు.

  • ఐసోలేషన్ వార్డుల ఏర్పాటుపై సమగ్ర నివేదిక ఇవ్వాలి: జగన్

ప్రతి ఆస్పత్రిలో ఐసొలేషన్‌ వార్డు ఏర్పాటుపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. దీనిపై నిశితంగా సమీక్ష చేసి ఎప్పటికప్పడు నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

  • రైతులను పూర్తిగా ఆదుకోవాలి: సీఎం

వ్యవసాయంపై కరోనా ప్రభావం, రైతుల కోసం తీసుకుంటున్న చర్యలపై సీఎం సమీక్ష జరిపారు. రవాణా విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. ధాన్యం రవాణాకు ఎన్ని లారీలు కావాలో చూసి ఆ మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. బయట మార్కెట్లలోనూ రైతులు తమ ఉత్పత్తులు అమ్ముకోవచ్చన్న సీఎం.. మార్కెటింగ్‌, రవాణాకు సహకరించాలని అధికారులకు సూచించారు. పండ్లను స్థానిక మార్కెట్లలో అమ్మేందుకు చర్యలు తీసుకున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరంచారు. స్వయం సహాయక సంఘాల ద్వారా అరటి విక్రయం ప్రారంభించామని తెలిపారు. చీనీ పంటనూ గ్రామాల్లోకి తీసుకెళ్లేలా ప్రయత్నాలు చేస్తామని వివరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.