కరోనా నివారణ చర్యలపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రతి ఆస్పత్రిలో ఐసొలేషన్ వార్డు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రతి జిల్లాలోనూ టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేయాలన్న సీఎం... ఇప్పుడున్న ల్యాబ్‌ల సామర్థ్యం పెంచాలని అధికారులకు సూచించారు. సంబంధిత లక్షణాలతో ఎవరొచ్చినా కరోనా పేషెంట్‌గానే భావించాలని స్పష్టం చేశారు.
వైద్య సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకుని చికిత్స అందించాలని సీఎం జగన్ సూచించారు. దీనిపై ఇదివరకే జారీచేసిన మార్గదర్శకాలు పాటించేలా చూడాలన్న సీఎం... దిల్లీ జమాత్‌కు వెళ్లినవారు, వారు కలిసిన వారికి త్వరగా పరీక్షలు చేయాలని స్పష్టం చేశారు. ప్రతి ఇంటి ఆరోగ్య పరిస్థితిపై నిత్యం సర్వే జరగాలని మరోసారి ఆదేశించారు. ఈ నెల 14 తర్వాత కేంద్రం తగిన మార్గదర్శకాలు ఇస్తుందని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. వాటి ఆధారంగా తగిన చర్యలు తీసుకునేందుకు సిద్ధం కావాలని దిశానిర్దేశం చేశారు.
ఇదీ చదవండీ... రాష్ట్రంలో 226కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు