ETV Bharat / city

రైతులకు కనీస మద్దతు ధర కచ్చితంగా ఇవ్వాలి: సీఎం జగన్ - సీఎం జగన్ తాజా వార్తలు

కనీస మద్దతు ధర కన్నా తక్కువ ధరకు ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయనే మాట రాకూడదని ముఖ్యమంత్రి జగన్ అధికారులతో అన్నారు. అగ్రి ఇన్​ఫ్రా ఫండ్ ప్రాజెక్ట్, ఈ-మార్కెటింగ్ ఫ్లాట్​ఫామ్స్​పై సమీక్ష నిర్వహించారు. సీఎం యాప్ పనితీరును సమీక్షించారు.

cm jagan
సీఎం జగన్
author img

By

Published : Oct 28, 2020, 3:58 PM IST

రైతులకు వారు తెచ్చే పంటలకు సరైన ధర వచ్చేలా వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఎంఎన్​పీ కన్నా తక్కువ ధరకు కొనుగోళ్లు జరుగుతున్నాయనే మాట రాకూడదని అన్నారు. ఏయే పంటలకు ఎంఎస్‌పీ లభించడం లేదో సమాచారం యాప్‌ ద్వారా వస్తోందని అధికారులు సీఎంకు తెలిపారు. 10,641 ఆర్బీకేల ద్వారా పంటలకు కనీస ధరలు సమాచారం ఖచ్చితంగా రావాలని సీఎం చెప్పారు. ఆ నివేదికలను, అలర్ట్స్‌ను ప్రతిరోజూ పరిశీలించాలని ఆదేశించారు.

రైతులకు 10 రోజుల్లో నగదు అందాలి

కనీస ధర ఎందుకు రావడంలేదో పరిశీలన చేసి, జిల్లాల్లో ఉన్న జేసీలద్వారా చర్యలు తీసుకోవాలని సూచించారు. సంబంధిత ఆర్బేకేల్లోని అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ ద్వారా వివరాలు తెలుసుకుని.. ఆయా శాఖల ద్వారా రైతుల్ని ఆదుకునే చర్యలను చేపట్టాలని అధికారులతో అన్నారు. రైతులనుంచి చేసిన కొనుగోళ్లకు 10 రోజుల్లోగా నగదు అందేలా చూడాలని సూచించారు. 5812 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.

వర్షాలకు దెబ్బతిన్న పంటలు కొనండి

పంటలకు కనీస మద్దతు ధరల రేట్లను ఆర్బీకేల్లో ప్రదర్శించాలని సీఎం ఆదేశించారు. రైతులందరికీ తెలిసేలా పెద్ద పెద్ద పోస్టర్లు పెట్టాలన్నారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న వరి, వేరుశెనగ, పత్తిలాంటి పంటలను కొనుగోలు చేయాలన్నారు. రైతులు ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. పత్తిరై తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలని కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా అధికారులకు సూచించారు.

ఇవీ చదవండి..

ప్రజాధనంతో రాష్ట్రంలో మత వ్యాప్తి: ప్రధానికి రఘురామ లేఖ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.