ETV Bharat / city

రైతు భరోసా ఆర్థిక సాయం...మరో వెయ్యి పెంపు - రైతు భరోసా పథకం

రైతు భరోసా ఆర్థిక సాయాన్ని..... మరో వెయ్యి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రైతు ప్రతినిధుల విజ్ఞప్తితో.. 12 వేల 500 నుంచి 13 వేల 500కు పెంచాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. 'వ్యవసాయ మిషన్'పై అధికారులతో సమీక్షించిన జగన్ 'రైతు భరోసా' పథకంపై విస్తృతంగా చర్చించారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.6 వేలతో కలుపకుని రాష్ట్ర ప్రభుత్వం రూ.13,500 చెల్లించనుంది.

rythu bharosa
author img

By

Published : Oct 14, 2019, 3:24 PM IST

Updated : Oct 14, 2019, 8:50 PM IST

రైతు భరోసా ఆర్థిక సాయం మరో వెయ్యి పెంపు

అమరావతిలో వ్యవసాయ మిషన్​పై ముఖ్యమంత్రి జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతు భరోసాపై విస్తృతంగా చర్చించారు. రైతు భరోసా కింద ఆర్థికసాయం రూ. 13,500 కి పెంచుతున్నట్లు ప్రకటించారు. రైతు ప్రతినిధుల విజ్ఞప్తితో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అర్హత ఉన్న ప్రతి రైతుకూ లబ్ధి చేకూరాలని.. అధికారులకు సీఎం సూచించారు. సమావేశంలో మార్కెటింగ్, ధరల స్థిరీకరణపైనా చర్చించారు. వర్షాల ఆలస్యంతో పంటలు దెబ్బతిన్నాయని..సీఎంకు రైతు ప్రతినిధులు వివరించారు.

ఖరీఫ్​లోనూ పూర్తిస్థాయిలో సాగు కాలేదన్న రైతు ప్రతినిధులు... పెట్టుబడి సాయం కింద సంక్రాంతి సమయంలో ఎంతో కొంతమొత్తం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వీలైతే 2, 3 విడతలుగా ఇచ్చినా అభ్యంతరం లేదని కోరారు. రబీ అవసరాలకు కొంత మొత్తం పెంచి ఇవ్వాలన్న రైతు ప్రతినిధుల విఙ్ఞప్తితో.... మరో వెయ్యి పెంచుతున్నట్లు సీఎం నిర్ణయించారు. వ్యవసాయ కాలేజీల్లో ప్రమాణాలు, మిల్లెట్స్ బోర్డు, చక్కెర కర్మాగారాల పునర్ వ్యవస్థీకరణపైనా ముఖ్యమంత్రి చర్చించారు. తెలంగాణతో పోలిస్తే... ఏపీలో పామాయిల్ తక్కువ రికవరీపై.... జగన్​కు అధికారులు ఫిర్యాదు చేశారు.

Last Updated : Oct 14, 2019, 8:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.