ETV Bharat / city

పీపీ-1 నుంచి డిగ్రీ వరకు అంతా ఆంగ్ల మాధ్యమమే - సీఎం జగన్ తాజా సమాచారం

రాష్ట్రంలో పూర్వ ప్రాథమిక విద్య(పీపీ-1) నుంచి డిగ్రీ వరకు విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలోనే అభ్యసించేలా గొప్ప ప్రయత్నాన్ని మొదలు పెట్టామని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఈ ఏడాది రెండో విడత విద్యా దీవెనలో భాగంగా 10.97 లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో రూ.693.81 కోట్లను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్‌ గురువారం బటన్‌ నొక్కి జమ చేశారు. మూడో విడత డిసెంబరులో, నాలుగో విడత ఫిబ్రవరిలో చెల్లిస్తామని ప్రకటించారు.

సీఎం జగన్‌
సీఎం జగన్‌
author img

By

Published : Jul 30, 2021, 7:23 AM IST

అంగన్‌వాడీ కేంద్రాల్లోని పూర్వ ప్రాథమిక విద్య(పీపీ-1) నుంచి డిగ్రీ వరకు విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలోనే అభ్యసించేలా గొప్ప ప్రయత్నాన్ని మొదలు పెట్టామని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ‘అంగన్‌వాడీ కేంద్రాల నుంచే చదువుల విప్లవం తీసుకురావాలని తాపత్రయపడుతున్నాం. అందుకే అక్కడ పీపీ-1, పీపీ-2 విధానాన్ని ప్రారంభించి ఆంగ్ల మాధ్యమాన్ని తీసుకొచ్చాం’ అని పేర్కొన్నారు. ‘పిల్లలకు ఇవ్వదగిన ఆస్తి ఏదైనా ఉందంటే అది చదువేనని గట్టిగా నమ్ముతా. అందరికీ పెద్ద చదువులు అందుబాటులోకి రావాలి. అప్పుడే మంచి ఉద్యోగాలు వస్తాయి. ఆ చదువుల కోసం తల్లిదండ్రులు అప్పులపాలు కాకూడదు. దీనికోసం బోధనా రుసుంల విషయంలో నాన్న ఒక అడుగు ముందుకేస్తే నేను నాలుగు అడుగులు ముందుకేశా’ అని ఈ సందర్భంగా సీఎం వివరించారు.

ఉన్నతోద్యోగాలు సాధించకపోతే పేదరికాన్ని తీసేయలేం...

‘రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం చదువురాని వారు 33% మంది ఉన్నారు. దేశ సగటు 27%. దేశం కన్నా రాష్ట్రం ఇంకా తక్కువ స్థాయిలో ఉంది. 18-23 సంవత్సరాల వయసు పిల్లల్లో ఇంటర్‌ తర్వాత మన దేశంలో 27% మంది మాత్రమే పైచదువుల కోసం కళాశాలలకు వెళుతున్నారు. పిల్లలు ఉన్నత విద్యను చదవకపోతే, పైస్థాయి ఉద్యోగాలను సాధించలేకపోతే పేదరికాన్ని ఎప్పుడూ తీసేయలేం’ అని స్పష్టం చేశారు.

రెండేళ్లలో విద్యారంగంపై రూ.26,677.82 కోట్లు ఖర్చు:

‘చదువు కోసం అప్పు చేయడాన్ని చూసి తట్టుకోలేక తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని నా పాదయాత్రలో నెల్లూరులో గోపాల్‌ అనే తండ్రి చెప్పడం నా మనసును కలచివేసింది. ఇలాంటి పరిస్థితిని మార్చేందుకు అడుగులు వేస్తున్నాం. పూర్తిస్థాయిలో బోధనా రుసుములను చెల్లిస్తున్నాం. వసతిగృహ ఖర్చుల కోసమూ ఏటా రూ.20 వేలను ఇస్తున్నాం. అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, గోరుముద్ద, విద్యాకానుక, నాడు-నేడు కింద రెండేళ్లలో విద్యారంగంపై రూ.26,677.82 కోట్లను ఖర్చు చేశాం’ అని సీఎం గుర్తుచేశారు.

డిసెంబరులో మూడో విడత విద్యాదీవెన:

‘ఐటీఐ, పాలిటెక్నిక్‌, డిగ్రీ, ఇంజినీరింగ్‌ వైద్యవిద్య చదువుల కోసం పూర్తి బోధనా రుసుములను ఇస్తున్నాం. ప్రతి త్రైమాసికానికి తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. వారు కళాశాలలకు వెళ్లి డబ్బులు కడుతున్నారు. గత ప్రభుత్వం పెట్టిన రూ.1,800 కోట్ల బకాయిలతో కలిపి రెండేళ్లలో రూ.5,573 కోట్లను బోధనా రుసుముల కింద చెల్లించాం. మూడో విడత డిసెంబరులో, నాలుగో విడత ఫిబ్రవరిలో చెల్లిస్తాం. వసతి దీవెన రెండో విడతను డిసెంబరులో ఇస్తాం’ అని ప్రకటించారు. ‘కళాశాలల్లో ఏమైనా సమస్యలున్నా, సదుపాయాల్లో లోపమున్నా 1902 నంబరుకు ఫోన్‌ చేస్తే ప్రభుత్వం వాటిని పరిష్కరిస్తుంది’ అని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు

ఇదీ చదవండి

Jagan bail cancel petition: 'జగన్ బెయిల్ రద్దు' పిటిషన్​పై నేడు విచారణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.