దిల్లీ, తిరుమల పర్యటన ముగించుకుని సీఎం జగన్ మోహన్ రెడ్డి...తాడేపల్లికి చేరుకున్నారు. తిరుమల పర్యటన అనంతరం సీఎం జగన్ నేరుగా హైదరాబాద్ వెళ్లారు. తన మామ, భారతి తండ్రి గంగిరెడ్డిని పరామర్శించేందుకు ఆయన హైదరాబాద్ వెళ్లారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గంగిరెడ్డి...గచ్చిబౌలి కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఆయన్ను పరామర్శించిన అనంతరం సీఎం జగన్ హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. గన్నవరం నుంచి రోడ్డు మార్గంలో తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు.
ఇదీ చదవండి : భూ రికార్డుల ప్రక్షాళన.. మంత్రి వర్గ ఉపసంఘం భేటీ