ETV Bharat / city

40 అంశాల అజెండాతో మంత్రి మండలి సమావేశం

శాసనసభ బడ్జెట్ సమావేశాల నిర్వహణతోపాటు.. మద్యం, ఇసుక అక్రమాల నియంత్రణకు కొత్తగా ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరోకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదాన్ని తెలియజేయనుంది. ఈ విషయంతో పాటు.. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. మొత్తం 40 అంశాల అజెండాను చర్చించి ఆమోదాన్ని తెలియజేయనున్నారు.

cabinet meeting today
cabinet meeting today
author img

By

Published : Jun 11, 2020, 2:00 AM IST

Updated : Jun 11, 2020, 11:09 AM IST

శాసనసభ బడ్జెట్ సమావేశాల నిర్వహణతోపాటు స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు.. రాష్ట్ర మంత్రి వర్గం సమావేశమైంది. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అంశాలను చర్చించి ఆమోదించనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన సచివాలయంలోని మొదటి బ్లాక్ లో ఉన్న మంత్రివర్గ సమావేశ మందిరంలో కేబినెట్ కొనసాగుతోంది.

ఇసుక, మద్యం అక్రమాలను నియంత్రణ నిమిత్తం ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరోకు.. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదాన్ని తెలియజేయనుంది. ప్రత్యేక ప్రభుత్వ విభాగంగా ఎస్ఈబీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందు కోసం.. బిజినెస్ రూల్స్ ను కూడా సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర మంత్రివర్గం దీనికి ఆమోదాన్ని తెలపాల్సి ఉంది.

రాష్ట్రంలో పరిశ్రమల వ్యర్ధాల నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏపీ ఎన్విరాన్మెం​ట్ కార్పొరేషన్​కు కూడా మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుంది. అలాగే గత శాసనసభలో ఆమోదం పొందని 4 ఆర్డినెన్సులను రాటిఫై చేయనున్నట్టు సమాచారం. అలాగే నూతన పారిశ్రామిక విధానాన్ని కూడా కేబినెట్ లో చర్చించి ఆమోదాన్ని తెలియచేసే అవకాశం ఉంది.

ఇక.. రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న విలేజ్ క్లినిక్ ల అంశంపైనా మంత్రివర్గంలో చర్చ జరగనుంది. మరోవైపు.. శాసనసభ నిర్వహణకు సంబంధించి మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. కరోనా విస్తృతి కారణంగా ఈ నెల 16 నుంచి నిర్వహించాల్సిన బడ్జెట్ సమావేశాలపై కేబినెట్ లో నిర్ణయం తీసుకున్న తర్వాతే ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం 40 అంశాలపై కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.

ఇదీ చదవండి:

రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవారినెలా తొలగిస్తారు?: సుప్రీం

Last Updated : Jun 11, 2020, 11:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.