ETV Bharat / city

టూరిజం కంట్రోల్ రూమ్‌లను ప్రారంభించిన సీఎం జగన్ - టూరిజం వార్తలు

పర్యాటక శాఖ ఏర్పాటుచేసిన టూరిజం కంట్రోల్ రూమ్‌లను సీఎం జగన్ ప్రారంభించారు. నదీ తీర పర్యాటక ప్రాంతాల్లో సురక్షిత బోటింగ్‌ ఆపరేషన్స్‌ కోసం కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

cm-jagan-opening-tourism-control-rooms-at-thadepalli-camp-office
టూరిజం కంట్రోల్ రూమ్‌లను ప్రారంభించిన సీఎం జగన్
author img

By

Published : Jun 19, 2020, 12:50 PM IST

రాష్ట్రంలోని 9 పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకశాఖ ఏర్పాటు చేసిన జలవిహార నియంత్రణ కేంద్రాలను ముఖ్యమంత్రి జగన్‌ ప్రారంభించారు. నదీ తీర పర్యాటక ప్రాంతాల్లో సురక్షిత బోటింగ్‌ కార్యకలాపాల కోసం ఏర్పాటు చేసిన కంట్రోల్‌రూమ్‌లను... తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా సీఎం ఆరంభించారు. పశ్చిమగోదావరి జిల్లాలో సింగనపల్లి, పేరంటాలపల్లి, పోచవరంలో... తూర్పు గోదావరి జిల్లాలో గండిపోచమ్మ, రాజమహేంద్రవరంలో బోటింగ్‌ కంట్రోల్‌ రూంలు ఏర్పాటయ్యాయి. విశాఖలో రుషికొండ బీచ్‌, గుంటూరు జిల్లాలో నాగార్జున సాగర్‌, కర్నూలు జిల్లాలో శ్రీశైలం, కృష్ణాలో విజయవాడ బరంపార్క్‌లో నియంత్రణ కేంద్రాలను... ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బోట్ల రిజిస్ట్రేషన్‌, లైసెన్సులు, ఫిట్‌నెస్‌ పరిశీలన, ప్రమాదం నుంచి బయటపడేసే పరికరాలు, భద్రత చర్యల పర్యవేక్షణ... వీటి లక్ష్యమని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: అచ్చెన్నాయుడు కేసు: కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.