లాక్డౌన్లో సీజ్ చేసిన వాహనాలను విడిచిపెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. ఈ అంశంపై పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు. 100 రూపాయల జరిమానాతో సరిపెట్టాలని సీఎం సూచించారు. మళ్లీ నిబంధనల్ని ఉల్లంఘించబోమంటూ వారి నుంచి హామీ పత్రాన్ని తీసుకోవాలని సూచించారు. వాహనాలు అప్పగించే సమయంలో కొవిడ్ జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు.
ఇదీ చదవండి: తమిళనాడులోని స్వామివారి స్థిరాస్తుల విక్రయానికి తితిదే నిర్ణయం