మంత్రులు స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఎన్నికల్లో వైకాపా గెలుపు బాధ్యతను మంత్రులతో పాటు ఎమ్మెల్యేలకు అప్పగించారు. విజయమే లక్ష్యంగా పనిచేయాలని.. డబ్బు, మద్యం పంపిణీ చేయకుండా ఉండాలని దిశానిర్దేశం చేశారు. మద్యం, డబ్బు పంపిణీ చేసినట్టు రుజువైతే జైలుకు వెళ్లక తప్పదని.. ఈ విషయంలో అధికార పార్టీ నేతలనూ ఊపేక్షించేది లేదని హెచ్చరించారు.
ఏ మాత్రం తేడా వచ్చినా మంత్రి పదవులు ఊడతాయని స్పష్టం చేశారు. మంత్రులు సొంత నియోజకవర్గాల్లో ఓడితే 5 నిమిషాలు కూడా ఆలోచించబోనన్న జగన్.. పనితీరు సరిగాలేని ఎమ్మెల్యేలకు వచ్చేసారి టిక్కెట్లు ఇచ్చేది లేదని తేల్చారు. రేపటి నుంచి 8వ తేదీ వరకు కార్యకర్తల సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చాక పూర్తి సన్నద్ధతతో రంగంలోకి దిగాలన్నారు. రిజర్వేషన్లపై ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే సూచనలు ఉన్నాయని చెప్పారు.
ఇవీ చదవండి: