ETV Bharat / city

ఊరూరా వైఎస్సార్​ పేర్లే.. దేన్నీ వదల్లేదు

YSR NAMES : మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి పేరు తెలియని వారు లేరు. ఇప్పుడు ఆయన పేరు ఎందుకంటే తాజాగా ముఖ్యమంత్రి వైఎస్​ జగన్​ ఎన్టీఆర్​ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్​ పేరును మార్చి వైఎస్సార్​ పేరు పెట్టిన విషయం తెలిసిందే. అయితే కేవలం రాష్ట్ర స్థాయి పథకాలు, కార్యక్రమాలకే కాదు.. వివిధ ప్రాంతాలు, జిల్లాలు, మండలాల్లో చాలా వాటికి ఆయన పేరే పెట్టారు. జగన్​ అధికారంలోకి వచ్చాక వైఎస్​ పేరు పెట్టడాన్ని ఒక ఉద్యమంలా అమలు చేశారు.

YSR NAMES IN AP
YSR NAMES IN AP
author img

By

Published : Sep 23, 2022, 8:45 AM IST

YSR NAMES IN AP : రాష్ట్ర స్థాయి పథకాలు, కార్యక్రమాలకే కాదు.. వివిధ ప్రాంతాలు, జిల్లాలు, మండలాల్లో ఉన్న సాగునీటి పథకాలు, భవనాలు, మైదానాలు, పరిశోధన కేంద్రాలు, విద్యా సంస్థలు, రహదారులు, పార్కులు సహా అన్నింటికీ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి పేరు పెట్టారు. ఆయన మరణించిన తర్వాత గత ప్రభుత్వాల హయాంలో కొన్నింటికి రాజశేఖరరెడ్డి పేరు పెట్టగా.. జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్‌ఆర్‌ పేరు పెట్టడాన్ని ఒక ఉద్యమంలా అమలు చేశారు. గతంలో ఉన్న వివిధ ప్రాజెక్టుల పేర్లు మార్చేసి.. వాటికి రాజశేఖరరెడ్డి పేరు తగిలించారు. వాటిల్లో కొన్ని ముఖ్యమైనవి ఇవి..

ప్రభుత్వ వైద్యశాలలకూ ఆ పేరే..

* నరసరావుపేట పట్టణంలోని 200 పడకల ఆసుపత్రికి నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాల అని ఉండగా డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ప్రభుత్వ వైద్యశాలగా మార్చారు.

* తిరుపతిలోని వెటర్నరీ విశ్వవిద్యాలయం ప్రధాన భవనానికి వైఎస్‌ఆర్‌ భవన్‌ అని పేరు పెట్టారు.

* తిరుపతి మున్సిపల్‌ కార్యాలయంలో కౌన్సిల్‌ సమావేశాలతో పాటు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించే భవనానికి వైఎస్‌ఆర్‌ భవన్‌ అనే పేరు ఉంది.

* తిరుపతిలోని డీబీఆర్‌ ఆసుపత్రికి వెళ్లే మార్గానికి ఇటీవలే వైఎస్‌ఆర్‌ మార్గ్‌ అని పేరు పెట్టారు.

* గూడూరు మున్సిపల్‌ కార్యాలయ భవనానికి డా. వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి భవనం అని పెట్టారు.

* పుత్తూరులోని మెప్మా భవనానికి వైఎస్‌ఆర్‌ సమావేశ మందిరం అనే పేరు పెట్టారు. పుత్తూరులోని పార్కుకు వైఎస్‌ఆర్‌ పార్కు అని నామకరణం చేశారు.

* విశాఖపట్నం నగరంలోని ఎన్‌.ఎ.డి.కూడలిలో నిర్మించిన పైవంతెనకు రాజశేఖరరెడ్డి పేరు పెట్టాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఆ పేరును అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

* పొన్నూరులో డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి పురపాలక సంఘం అని పేరు పెట్టారు.

* బాపట్ల జిల్లాలో 40 బల్క్‌మిల్క్‌ కూలింగ్‌ కేంద్రాలు వైఎస్‌ఆర్‌ పేరుతో ఉన్నాయి.

* బాపట్ల మార్కెట్‌ యార్డుకు డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ మార్కెట్‌ యార్డు అని పేరు మార్చారు.

* చుండూరు మండలంలోని చినపరిమి గ్రామ సచివాలయానికి వైఎస్‌ఆర్‌ గ్రామ సచివాలయం అని నామకరణం చేశారు.

* పల్నాడు జిల్లా మాచర్ల మార్కెట్‌యార్డు ఆర్చీకి డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ముఖద్వారం అని పేరు పెట్టారు.

* వినుకొండ పట్టణంలోని మున్సిపల్‌ కాంప్లెక్స్‌కు గత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో వైఎస్‌ఆర్‌ వాణిజ్య సముదాయంగా నామకరణం చేశారు.

* చిలకలూరిపేట పట్టణంలో కూరగాయల మార్కెట్‌కు చంద్రమౌళి కూరగాయల మార్కెట్‌ అని ఉండగా దానిని మార్చి డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ కూరగాయల మార్కెట్‌గా మార్చారు.

* చిలకలూరిపేట పట్టణంలో ఉన్న మార్కెట్‌ యార్డుకు ప్రత్తిపాటి పుల్లారావు వ్యవసాయ మార్కెట్‌ అని ఉండగా దాని పేరు మార్చి డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ వ్యవసాయ మార్కెట్‌ అని మార్చారు.

* విశాఖలోని సిటీ సెంట్రల్‌ పార్క్‌కు ‘డాక్టర్‌ వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి సెంట్రల్‌ పార్క్‌’ అని నామకరణం చేశారు.

* విజయవాడలోని జక్కంపూడి కాలనీకి వైఎస్‌ఆర్‌ కాలనీగా పేరు.

* విజయవాడలోని భవానీపురం క్రాంబే రోడ్డుకు వైఎస్‌ఆర్‌ రోడ్డుగా నామకరణం.

* నెల్లూరు నగరపాలక సంస్థకు.. వైఎస్‌ఆర్‌ నెల్లూరు నగరపాలక సంస్థగా పేరు.

* కందుకూరులో వైఎస్‌ఆర్‌ ఉద్యాన కళాశాల.

* కందుకూరులో వైఎస్‌ఆర్‌ సమ్మర్‌ స్టోరేజీ ట్యాంక్‌.

* చిత్తూరులోని జిల్లా పరిషత్‌ సమావేశ మందిరానికి ‘వైఎస్‌ఆర్‌ సభా వేదిక’ అని పేరు.

* కృష్ణా విశ్వవిద్యాలయంలోని పరిపాలన భవనం ఉన్న బ్లాక్‌కు వైఎస్‌ఆర్‌ పేరు.

* శ్రీకాకుళం పట్టణంలోని కల్యాణ మండపానికి వైఎస్‌ఆర్‌ మున్సిపల్‌ కల్యాణ మండపంగా పేరు.

* తాడేపల్లిగూడెం ఉద్యాన విశ్వవిద్యాలయంలోని రైతు శిక్షణ కేంద్రానికి వైఎస్‌ఆర్‌ రైతు శిక్షణ కేంద్రం అని పేరు.

ఈ ప్రాజెక్టుల పేర్లు మార్చి వైఎస్‌ఆర్‌ పేరు పెట్టారు..

* వెలిగల్లు ప్రాజెక్టు -వైఎస్‌ఆర్‌ వెలిగల్లు రిజర్వాయరు.

* వరికపూడిసెల ఎత్తిపోతల పథకం - వైఎస్‌ఆర్‌ పల్నాడు కరవు నివారణ ప్రాజెక్టు.

* పరిటాల రవీంద్ర ఎత్తిపోతల పథకం - వైఎస్‌ఆర్‌ అప్పర్‌ పెన్నార్‌ ప్రాజెక్ట్‌.

జిల్లాల్లో వైఎస్‌ఆర్‌ పేరుతో ఉన్న వాటిలో కొన్ని ముఖ్యమైనవి

* వైఎస్‌ఆర్‌ వేదాద్రి ఎత్తిపోతల పథకం.

* వైఎస్‌ఆర్‌ తాడిగడప పురపాలక సంఘం.

* విజయవాడలోని అవతార్‌ పార్క్‌.. వైఎస్‌ఆర్‌ పార్కుగా పేరు మార్పు.

* డా.వైఎస్‌ రాజశేఖరరెడ్డి పొన్నూరు పురపాలక సంఘం.

* గుంటూరు జిల్లాలోని మంగళగిరి మండల పరిషత్‌ భవనానికి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి భవనంగా నామకరణం.

* నందిగామలోని దేవినేని వెంకట రమణ రైతు బజారు.. వైఎస్‌ఆర్‌ రైతు బజారు, పండ్ల మార్కెట్‌గా మార్పు.

వైఎస్‌ఆర్‌ పేరుతో ఉన్నవి మరికొన్ని

* వైఎస్‌ఆర్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ.

* కడపలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి బస్‌స్టేషన్‌.

* ప్రొద్దుటూరులో వైఎస్‌ఆర్‌ పురపాలక సంఘం.

* కడపలో వైఎస్‌ఆర్‌ ఇండోర్‌ స్టేడియం.

* కడపలో వైఎస్‌ఆర్‌ క్రీడా పాఠశాల.

* వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం.

* కలిదిండిలో వైఎస్‌ఆర్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల.

* ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్‌ కళాశాలకు వైఎస్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల అని పేరు పెట్టారు..

భవనాలు, మైదానాలు, పరిశోధన కేంద్రాలకూ

* ఎలమంచిలి పట్టణంలో రూ. 2.50 కోట్ల వ్యయంతో నిర్మించిన ఇండోర్‌ స్టేడియానికి వైఎస్‌ఆర్‌ ఇండోర్‌ స్టేడియంగా పేరు. 2013 నిధులు మంజూరయ్యాయి. తెదేపా హయాంలో పనులు పూర్తయ్యాయి. వైకాపా హయాంలో ప్రారంభోత్సవం చేసి పేరు పెట్టుకున్నారు.

* తిరుపతి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (తుడా) భవనం పేరు ‘డా.వైఎస్‌ఆర్‌ భవన్‌’.

* ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన క్రీడా వికాస కేంద్రానికి ఈ ప్రభుత్వం వచ్చాక ‘డా.వైఎస్సార్‌ క్రీడా వికాస కేంద్రం’గా పేరు.

* అంబాజీపేటలోని ఉద్యాన పరిశోధన కేంద్రం పేరును డా.వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం, ఉద్యాన పరిశోధన కేంద్రంగా మార్చారు. అంతకుముందు ఎన్జీ రంగా పేరుతో ఉండేది. వై.ఎస్‌. మరణాంతరం 2010లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం పేరు మార్చింది.

* విశాఖపట్నంలోని మధురవాడలోని అంతర్జాతీయ క్రికెట్‌ మైదానానికి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి ఎ.సి.ఎ.- వి.డి.సి.ఎ. క్రికెట్‌ స్టేడియంగా నామకరణం చేశారు. వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి మృతి చెందిన తరువాత ఆయన జ్ఞాపకార్థం క్రికెట్‌ స్టేడియం పేరుకు డాక్టర్‌ రాజశేఖరరెడ్డి పేరు జత చేశారు.

* కాకినాడ గ్రామీణ మండలం నేమాం పంచాయతీ పరిధిలోని జగనన్న కాలనీకి వై.ఎస్‌.జగన్మోహనపురం అని పేరు పెట్టారు.

* బాపట్ల జిల్లాలోని జె.పంగలూరు మండల పరిషత్‌ భవనానికి వైఎస్‌ రాజశేఖరరెడ్డి భవన్‌ అని నామకరణం చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.