కృష్ణపట్నం పారిశ్రామికవాడలో ఉక్కు కర్మాగారం నెలకొల్పేందుకు పోస్కో గతంలో పర్యటించిందని, దీనికి దక్షిణ కొరియా ప్రభుత్వం కూడా కృషి చేయాలని ఆ దేశ కాన్సుల్ జనరల్ యాంగ్ షూ క్వాన్‌ను.. సీఎం జగన్ కోరారు. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ఇరువురూ ఈ విషయమై చర్చించారు.
దక్షిణ కొరియా కాన్సుల్ జనరల్ యాంగ్ షూ క్వాన్.. మర్యాదపూర్వకంగా సీఎంను కలిసిన సందర్భంగా.. రాష్ట్ర ఆర్థిక వృద్ధిలో దక్షిణ కొరియా సహకారంపై మాట్లాడారు. రాష్ట్రంలో సాంకేతిక రంగ విజ్ఞానాభివృద్ధిలో భాగంగా కొరియన్ యూనివర్శిటీకి, ఏపీలోని విశ్వవిద్యాలయాల మధ్య సహకారం ఉండాలని జగన్ కోరారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు.
ఇదీ చదవండి:
చంద్రబాబు ప్రచారంలో రాళ్ల దాడి... గవర్నర్, ఈసీకి ఫిర్యాదు చేసేందుకు నిర్ణయం