ETV Bharat / city

CM Jagan Meet PM Modi: ప్రత్యేక హోదా ఇస్తే రాష్ట్రానికి ఊరట: ప్రధానికి సీఎం జగన్ వినతి - సీఎం జగన్ మోదీ

ప్రత్యేక హోదా ఇస్తే రాష్ట్రానికి ఊరట: ప్రధానికి సీఎం జగన్ వినతి

author img

By

Published : Jan 3, 2022, 4:30 PM IST

Updated : Jan 4, 2022, 6:05 AM IST

16:27 January 03

CM Jagan Delhi Tour ప్రధాని మోదీని కలిసిన సీఎం జగన్‌

ప్రత్యేక హోదా ఇస్తే రాష్ట్రానికి ఊరట: ప్రధానికి సీఎం జగన్ వినతి

CM Jagan Delhi Tour: ఆంధ్రప్రదేశ్‌ ఎదుర్కొంటున్న ఆర్థిక కష్టాలను తీర్చాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి జగన్‌ విజ్ఞప్తి చేశారు. విభజన సమస్యలు, ప్రత్యేక హోదా, పోలవరం సవరించిన అంచనాలకు ఆమోదం, రెవెన్యూ లోటు భర్తీ, నికర రుణపరిమితి పెంపు లాంటి ప్రధాన అంశాలను మోదీ దృష్టికి తీసుకెళ్లారు. 8 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందించి.. వాటిని సత్వరం పరిష్కరించి ఏపీని ఆదుకోవాలని కోరారు. ప్రధానికి సమర్పించిన వినతిపత్రంలో ఈసారి పాలనా వికేంద్రీకరణ, మూడు రాజధానులు, కర్నూలుకు హైకోర్టు తరలింపు లాంటి అంశాలు కనిపించ లేదు. సీఎం పేర్కొన్న డిమాండ్లన్నీ దాదాపు ఇదివరకు ప్రధానికి విన్నవించినవే. నేడు అమితిషా, నితిన్‌ గడ్కరీతో సీఎం భేటీ కానున్నారు.

CM Jagan Meet PM Modi: సోమవారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో విజయవాడ నుంచి దిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి జగన్‌ .. సాయంత్రం 4 గంట 12 నిమిషాల నుంచి 5 గంటల 12 నిమిషాల వరకు లోక్‌కల్యాణ్‌మార్గ్‌లోని ప్రధాని మోదీ అధికార నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. విభజన అనంతర పరిణామాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీశాయని.. 58శాతం జనాభా ఉన్న రాష్ట్రానికి 45 శాతం ఆదాయం మాత్రమే దక్కిందని వివరించారు. రాష్ట్ర విభజనతో నష్టపోయిన ఏపీకి ఆ లోటు తీర్చడానికి ప్రత్యేక హోదా హామీతోపాటు అనేక హామీలిచ్చారని, అందులో చాలావరకు ఇప్పటికీ నెరవేర్చలేదని గుర్తు చేశారు.

పోలవరానికి రూ. 55,657 కోట్లు ఇవ్వండి
2013 నాటి భూసేకరణ చట్టంవల్ల పోలవరం ప్రాజెక్టు ఖర్చు గణనీయంగా పెరిగిందన్న జగన్‌ .. 2014 ఏప్రిల్‌ 1 అంచనాల మేరకే పోలవరానికి నిధులిస్తామని కేంద్ర ఆర్థికశాఖ 2016లో చెప్పిందన్నారు. 2014 తర్వాత పెరిగిన ప్రాజెక్టు వ్యయాన్ని పరిగణనలోకి తీసుకోలేదన్నారు. అప్పటివరకూ ఇరిగేషన్‌ కాంపొనెంట్‌ రూపంలో చేసిన ఖర్చులనూ మినహాయించినందున ప్రాజెక్టుపై పెరిగిన ఖర్చంతా రాష్ట్ర ప్రభుత్వం మీదే పడుతోందన్నారు. ప్రాజెక్టు ఖర్చులో అధిక భాగం 2013 నాటి భూసేకరణ చట్టం అమలుకే పెట్టాల్సి ఉంటుందని.. ఇది రాష్ట్రానికి తీవ్ర భారమన్నారు. భూసేకరణ, పరిహారం-పునరావాసం రూపేణా సవరించిన అంచనాలకు కేంద్ర ప్రభుత్వ సంస్థలే ఆమోదం తెలిపినా.. ఆ మేరకు నిధులిచ్చేందుకు తిరస్కరిస్తున్నారని ప్రధానికి వివరించారు. పోలవరం ప్రాజెక్టులో కేవలం ఇరిగేషన్‌ భాగానికి మాత్రమే నిధులిస్తామనడమూ సరికాదన్నారు. స్వయంగా ప్రధాని జోక్యం చేసుకుని 2017-18 ధరల ప్రకారం పోలవరం అంచనా వ్యయాన్ని రూ.55,657 కోట్లుగా నిర్ణయించాలని సీఎం కోరారు. పెండింగ్‌ బిల్లులను వెంటనే మంజూరు చేసేలా ఆర్థికశాఖకు ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రానికి అండగా నిలవాలని విజ్ఞప్తి..
రాష్ట్ర విభజన నాటికి, 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల అమలు తేదీకి మధ్యనున్న రెవెన్యూ లోటును కేంద్ర బడ్జెట్‌ ద్వారా భర్తీ చేస్తామని నాటి ప్రధాని పేర్కొన్నారన్న జగన్‌... ఆ మేరకు 16 వేల 78 కోట్ల 76 లక్షల రూపాయల లోటు ఉన్నట్లు కాగ్‌ నిర్ధారించిందని ప్రధానికి గుర్తు చేశారు. తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రామాణిక వ్యయం పేరిట కొత్త పద్ధతిని తీసుకొచ్చి లోటును 4 వేల 117 కోట్ల 89 లక్షల రూపాయలకు కుదించింది. దీంతో నిధుల కొరత ఏర్పడి 2014-15 ఆర్థిక సంవత్సరంలో చాలా బిల్లులు, పీఆర్సీ బకాయిలను చెల్లించలేకపోయామన్నారు. వాటిని పరిగణనలోకి తీసుకుంటే రెవెన్యూ లోటు 22 వేల 948 కోట్ల 76 లక్షలకు చేరింద్నారు. కానీ ఇచ్చింది 4 వేల 117 కోట్ల 89 లక్షల రూపాయలు మాత్రేమేనన్నారు . పెండింగులో ఉన్న 18 వేల 830 కోట్ల 87 లక్షల చెల్లించి రాష్ట్రానికి అండగా నిలవాలని కోరారు.

రెవెన్యూలోటు భర్తీ చేయండి
2019-20లో దేశవ్యాప్తంగా ఆర్థిక ప్రగతి మందగించడంతో కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటా 34 వేల 833 కోట్ల నుంచి 28 వేల 242 కోట్లకు తగ్గిపోయిందన్న సీఎం జగన్‌.. 2020-21లో కేంద్ర పన్నుల్లో 7 వేల 780 కోట్ల నష్టం వాటిల్లిందని రాష్ట్ర సొంత ఆదాయమూ 7వేల కోట్లు కోల్పోయినట్లు ప్రధానికి తెలిపారు. ఇదే సమయంలో కొవిడ్‌ నివారణకు దాదాపు .8వేల కోట్లు ఖర్చు చేసినందున .. పన్నుల వాటాలో నష్టాన్ని పూడ్చాలని మోదీకి విజ్ఞప్తి చేశారు. 2021-22లో కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం రాష్ట్ర గరిష్ఠ రుణ పరిమితిని 42 వేల 472 కోట్లుగా నిర్ధారించిందన్నారు. కానీ గత ప్రభుత్వ హయాంలో చేసిన అధిక అప్పులను పరిగణనలోకి తీసుకుని దానిని 17 వేల 923 కోట్ల 24 లక్షలకు తగ్గిస్తున్నట్లుగా ఆర్థికశాఖ తెలిపిందన్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఇలా కోత విధించడం సరికాదన్న సీఎం.. రుణపరిమితిలో కోతను మూడేళ్లకు విస్తరించాలని చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోలేదన్నారు. గత అయిదేళ్ల కంటే ముందు ఇచ్చిన రుణ పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వినియోగించుకోలేదన్నారు. 2021-22లో నికరణ రుణ పరిమితిని 42 వేల 472 కోట్లుగా నిర్ణయించి, ఆ మేరకు అప్పులు తెచ్చుకునేందుకు అవకాశమివ్వాలని ప్రధానిని కోరారు.

విద్యుత్తు బిల్లు బకాయిలు ఇప్పించండి
రాష్ట్ర విభజన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థలకు ఏపీ జెన్‌కో విద్యుత్తు అందించిందన్న జగన్‌.. ఈమేరకు రాష్ట్రానికి రావాల్సిన 6 వేల 284 కోట్ల బకాయిలను చెల్లించేలా తెలంగాణ సంస్థలకు తగిన ఆదేశాలివ్వాలని ప్రధానిని కోరారు. రాష్ట్రంలో అర్హులైన చాలామంది జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోకి రాకపోవడంతో 56 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వమే అదనంగా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా తిండిగింజలు సరఫరా చేస్తోందని.. ఇది తమకు భారంగా మారిందన్నారు.

అర్హులందరికీ ఆహార భద్రత కల్పించండి
రాష్ట్రంలో దారిద్య్రరేఖకు దిగువనున్న వారిపై సమగ్ర పరిశీలన జరిపి, ఎక్కువ మంది లబ్ధిదారులు జాతీయ పథకం పరిధిలోకి వచ్చేలా చూడాలని కోరారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి సైట్‌ క్లియరెన్స్‌ అప్రూవల్‌ను రెన్యువల్‌ చేయాలని విజ్ఞప్తి చేశారు. కడప జిల్లాలో ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ ప్లాంటు ఏర్పాటుకు సంబంధించి మెకాన్‌ సంస్థ నుంచి వీలైనంత త్వరగా నివేదిక వచ్చేలా చూడాలని కోరారు. స్టీల్‌ ప్లాంటు కోసం ఏర్పాటు చేసిన వైయస్సార్‌ స్టీల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు ఏపీ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ కింద ఉన్న గనులను వేలంలో కాకుండా నేరుగా కేటాయించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ
ప్రధానితో భేటీ అనంతరం ముఖ్యమంత్రి జగన్‌ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యారు. రెవెన్యూ లోటు భర్తీ, రాష్ట్ర నికర రుణ పరిమితి పెంపు, పోలవరం సవరించిన అంచనాలకు ఆమోదం, రాబోయే బడ్జెట్‌లో నిధుల కేటాయింపు, పెండింగ్‌ బిల్లుల చెల్లింపు లాంటి అంశాలను ఆర్థిక మంత్రికి నివేదించారు. ఆ తర్వాత జగన్‌ పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను కలిసి భోగాపురం విమానాశ్రయ అనుమతుల అంశంపై మాట్లాడారు.

నేడు అమిత్​ షాతో భేటీ కానున్న జగన్​​

ఈ ఉదయం కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, రహదారులు, రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో సీఎం భేటీ కానున్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి.

ఇదీ చదవండి:

అమరావతిపై సర్కారు కీలక నిర్ణయం.. నగరపాలక సంస్థగా మార్చనున్నట్టు ప్రకటన!

Last Updated : Jan 4, 2022, 6:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.