జగన్ అక్రమాస్తుల కేసుపై హైదరాబాద్లోని సీబీఐ, ఈడీ కోర్టులో విచారణ జరిగింది.పెన్నా సిమెంట్స్ కేసులో జగన్ డిశ్చార్జ్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలుకు చేసేందుకు సీబీఐ మరోసారి గడువు కోరింది. ఇండియా సిమెంట్స్ కేసులోనూ డిశ్చార్జ్ పిటిషన్ వేస్తామని జగన్, విజయసాయిరెడ్డి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
ప్రస్తుత తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వేసిన డిశ్చార్జ్ పిటిషన్‌పై కౌంటరుకు సీబీఐ మరోసారి గడువు కోరింది. ఈ కారణంగా.. ఇండియా సిమెంట్స్ కేసు విచారణ ఈనెల 23కు వాయిదా వేసిన న్యాయస్థానం.. పెన్నా, రఘురాం సిమెంట్స్ కేసుల విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది.
ఇదీ చదవండి:
Letter: 'మా కుటుంబానికి భద్రత కల్పించండి'.. కడప ఎస్పీకి వివేకా కుమార్తె లేఖ