ETV Bharat / city

ఎట్టిపరిస్థితుల్లోనూ స్థానిక ఎన్నికలను అనుమతించకూడదు! - local elections 2020

ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో దూకుడుగానే ముందుకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికలతో కరోనా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా ప్రస్తుతం ఎట్టి పరిస్ధితుల్లోనూ స్థానిక ఎన్నికలు జరిపేందుకు అనుమతించకూడదని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై ఇప్పటికే గవర్నర్​కు ఎస్​ఈసీ ఫిర్యాదు చేసినందున ... ప్రభుత్వ తరపు వాదనలను గవర్నర్​కు తెలియజేయడం సహా జరుగుతున్న పరిణామాలను గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు సీఎం జగన్ ఆదేశించారు. తిరుపతి ఎంపీ స్థానానికి అభ్యర్థిపై విస్తృతంగా చర్చించారు. బల్లి దుర్గాప్రసాద్ కుటుంబం పోటీకి విముఖత వ్యక్తం చేస్తే అన్ని విధాలా ధీటైన వ్యక్తిని బరిలో నిలపాలని నిర్ణయించారు.

local elections 2020
local elections 2020
author img

By

Published : Nov 19, 2020, 9:56 PM IST

Updated : Nov 20, 2020, 1:12 PM IST

తిరుపతి ఉపఎన్నిక సహా తాజా రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు అందుబాటులో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశమయ్యారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి మంత్రులు కొడాలి నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. తిరుపతి లోక్​సభ పరిధిలోకి వచ్చే వైకాపా ఎమ్మెల్యేలు సమావేశానికి హాజరయ్యారు. త్వరలో తిరుపతి ఎంపీ స్థానానికి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రతిపక్ష తెదేపా మాజీ మంత్రి పనబాకలక్ష్మి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. దీంతో పార్టీ వెనకబడకుండా ఉండేందుకు ఉపఎన్నికలో పార్టీ అభ్యర్థి వీలైనంత త్వరలో ఎంపిక చేయాలని నిర్ణయించిన సీఎం జగన్.. అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేశారు.

స్థానిక ఎన్నికలపై సుదీర్ఘ చర్చ...

స్థానిక సంస్థలు ఎన్నికలు, ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంపై మంత్రలతో సీఎం సుదీర్ఘంగా చర్చించారు. ఫిబ్రవరిలో పంచాయితీ ఎన్నికలు జరపాలని ఎస్​ఈసీ నిర్ణయించగా ... కరోనా సెకండ్ వేవ్ ఉందని కారణంతో ప్రభుత్వం అందుకు అనుమతించబోమని స్పష్టం చేసింది. జిల్లా కలెక్టర్లతో ఎస్​ఈసీ తలపెట్టిన వీడియో కాన్ఫరెన్సులకూ అనుమతి ఇవ్వలేదు. వీటితో పాటు మంత్రుల వ్యాఖ్యలపై గవర్నర్​కు ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్​కు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగం విరుద్ధంగా వ్యవహరిస్తుందని, మంత్రులు తనను కించపరిచేలా మాట్లాడుతున్నారని తెలిపారు. ఈ అంశంపై ప్రభుత్వం తరపున ఎలా అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.

ఎన్నికల కమిషనర్​ మంత్రి కొడాలి నాని విమర్శలు

దూకుడుగానే ముందుకు...

నిమ్మగడ్డ విషయంలో దూకుడుగానే ముందుకు వెళ్లాలని ఎక్కడా వెనకడుగు వేయకూడదని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది. సమావేశం అనంతరం బయటకు వచ్చిన నేతలు నిమ్మగడ్డ రమేష్ పై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం అనుమతి లేకుండా ఎన్నికలను ఎలా నిర్వహిస్తారని మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. నిమ్మగడ్డను తక్షణం పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి విమర్శలు

గెలిపించాలి...

పార్టీ అభ్యర్థి ఎవరైతే బాగుంటుందనే విషయమై తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలోని నేతలు, మంత్రులతో అభిప్రాయాలు తీసుకున్నారు. దివంగత ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కుమారుడు కళ్యాణ్ చక్రవర్తి లేదా, భార్యకి టికెట్ ఇచ్చే విషయమై సమాలోచనలు చేశారు. పోటీకి ఆ కుటుంబం ఆసక్తి చూపకపోతే అన్ని విధాలా ధీటైన వ్యక్తిని బరిలో నిలపాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టాలనే విషయం ముఖ్యమంత్రికి అప్పగిస్తూ సమావేశంలో నేతలు నిర్ణయం తీసుకున్నారు. ఎవరిని అభ్యర్థిగా ప్రకటించినా అందరూ కలసిగట్టుగా పనిచేసి అభ్యర్థిని గెలిపించాలని సీఎం ఆదేశించారు. దీనితోపాటు ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలను సీఎం దృష్టికి తెచ్చి సత్వరం పరిష్కరించాలని కోరినట్లు తెలిపారు.

ఇసుక అక్రమ రవాణాపై చంద్రబాబు సహా ఇతర రాజకీయ పక్షాలు చేస్తోన్న ఆరోపణలపైనా చర్చ జరిగింది. వీటన్నింటినీ గట్టిగా తిప్పి కొట్టాలని నిర్ణయించారు. ప్రజలకు తక్కువ ధరకే ఇసుకను అందివ్వాలనే లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఇసుక సరఫరా కట్టబెడుతున్నారన్న విషయాన్ని తెలపాలని సీఎం సూచించారు. పోలవరం ప్రాజెక్టు వద్ద వైఎస్ఆర్ భారీ విగ్రహం ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయించిన సీఎం జగన్.. వీటి ఏర్పాటుపై నేతలతో చర్చించారు.

ఇదీ చదవండి

35 వేలు డిమాండ్ చేశాడు..ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు

Last Updated : Nov 20, 2020, 1:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.