ETV Bharat / city

ఒకటి నుంచి ఏడో తరగతి దాకా సీబీఎస్‌ఈ: సీఎం జగన్

మన బడి నాడు-నేడుపై సీఎం జగన్ సమీక్షించారు. ఈ ఏడాదే ఒకటి నుంచి ఏడో తరగతి వరకు సీబీఎస్ఈ విధానం అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. మొదటి దశ నాడు – నేడు పనులు మార్చి నెలాఖరుకల్లా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

cm jagan
cm jagan
author img

By

Published : Feb 24, 2021, 4:37 PM IST

Updated : Feb 25, 2021, 4:24 AM IST

వచ్చే విద్యా సంవత్సరం నుంచి 7వ తరగతి వరకూ ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్‌ఈ సిలబస్‌ను బోధించాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. 2024 నాటికి 8, 9, 10 తరగతులకూ వర్తింపజేయాలని, జగనన్న విద్యా కానుకలో ఆంగ్లం-తెలుగు నిఘంటువును చేర్చాలని సూచించారు. దానిని ఉపాధ్యాయులకూ ఇవ్వాలని ఆదేశించారు. ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు ఇచ్చే పుస్తకాల నాణ్యతతో పోటీ పడాలని పేర్కొన్నారు.

రాష్ట్రంలో పక్కా భవనాలు లేని 390 పాఠశాలలకు వెంటనే భవనాలు నిర్మించాలని సీఎం ఆదేశించారు. పాఠశాలల్లో మరుగుదొడ్ల శుభ్రతకు 27 వేల మంది ఆయాల్ని నియమించామని, మార్చి మొదటి వారంలో వీరందరికీ శిక్షణ ఇస్తామని అధికారులు సీఎంతో చెప్పారు. నాడు-నేడు తొలిదశ పనుల్ని మార్చి ఆఖరుకు పూర్తి చేయాలని, పాఠశాలలు రంగులతో ఆకర్షణీయంగా ఉండాలని జగన్‌ ఆదేశించారు. రెండోదశలో మరిన్ని మార్పులు చేయాలని, విద్యార్థుల బల్లలు సౌకర్యవంతంగా ఉండాలని పేర్కొన్నారు.

  • సీఎం ఇంకా ఏమన్నారంటే..
    - నాడు-నేడు పనుల్లో నాణ్యత కొరవడితే తీవ్రంగా పరిగణించాలి.
    - చిన్నారులకు ఎలా బోధించాలనే అంశంపై అంగన్‌వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇవ్వాలి. ఉపాధ్యాయులకూ శిక్షణ కొనసాగించాలి. వారు ఎంత నేర్చుకున్నారనే దానిపై రెండు నెలలకోసారి ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించాలి. వాటిలో ఉత్తీర్ణులయ్యారా? లేదా? అనేదానితో సంబంధం లేకుండా శిక్షణ ద్వారా వారు ఎంత మెరుగయ్యారో పరిశీలించాలి.
    - అమ్మఒడి పథకానికి బదులుగా ల్యాప్‌టాప్‌ను కోరుకున్న వారికి ఇచ్చేవి నాణ్యతతో ఉండాలి.

ఇదీ చదవండి

దారుణం: నరసరావుపేటలో నడిరోడ్డుపై డిగ్రీ విద్యార్థిని హత్య

Last Updated : Feb 25, 2021, 4:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.