ప్రజాగాయకుడు వంగపండు ప్రసాదరావు మృతిపట్ల సీఎం జగన్ సంతాపం తెలిపారు. వంగపండు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వంగపండు ఇక లేరన్న వార్త ఎంతో బాధించిందన్న సీఎం.. ప్రసాదరావు వ్యక్తిగతంగా తనకు ఆప్తులని అన్నారు. ఉత్తరాంధ్ర ఉద్యమానికి వంగపండు అక్షర సేనాధిపతిగా మారారని సీఎం తెలిపారు. తెలుగువారి సాహిత్య, కళారంగాల చరిత్రలో మహాశిఖరంగా నిలిచిపోతారని సీఎం జగన్ అన్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కరోనా విజృంభణ... మరో 7822 కరోనా కేసులు