రెండేళ్ల పాలన (two years for YCP govt) పూర్తి చేసుకున్న సందర్భంగా చేసిన ప్రయోజనాలను రాష్ట్ర ప్రజలకు తెలియజేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్(cm jagan) ప్రత్యేకంగా లేఖలు, డాక్యుమెంట్లను రూపొందించారు . ‘రెండో ఏటా ఇచ్చిన మాటకే పెద్దపీట’ పేరుతో లేఖ, ‘మలిఏడు – జగనన్న తోడు, జగనన్న మేనిఫెస్టో -2019’ డాక్యుమెంట్‌ను రూపొందించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వీటిని ఆవిష్కరించారు.
లంచాలు.. వివక్ష లేకుండా...
రెండేళ్ల పాలన పూర్తైన సందర్భంగా, ఇప్పటివరకు అమలు చేసిన పథకాలు, ప్రతి ఇంట్లో కలిగిన ప్రయోజనాలను వివరిస్తూ, రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో అక్క చెల్లెమ్మలకు వారి పేరుతో సీఎం లేఖలు రాశారు. మేనిఫెస్టోలో చెప్పిన వాటిలో ఈ రెండేళ్లలో అమలు చేసిన అంశాలు, మేనిఫెస్టోలో చెప్పకుండా అమలు చేసిన వాటిపై డాక్యుమెంట్‌ను రూపొందించారు. ఈ రెండింటినీ వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికీ పంపించనున్నారు. ‘దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో ఇవాళ మనందరి ప్రభుత్వం రెండు సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకుందని సీఎం అన్నారు. రాష్ట్రంలో 1 కోటి 64 లక్షల 68 వేల 591 ఇళ్లు ఉంటే వాటిలో 1 కోటి,41 లక్షల 52 వేల 386 ఇళ్లకు, అంటే దాదాపు 86 శాతం ఇళ్లకు ఏదో ఒక పథకం చేరిందని సీఎం తెలిపారు. 95 వేల 528 కోట్లు నగదు బదిలీ ద్వారా, మరో 36 వేల197 కోట్లు పరోక్షంగా నగదు బదిలీ ద్వారా ప్రజలకు చేరాయని ముఖ్యమంత్రి తెలిపారు. వైయస్సార్ ఆరోగ్యశ్రీ, జగనన్న తోడు, గోరుముద్ద, సంపూర్ణ పోషణ, విద్యా కానుక, ఇళ్ల స్థలాలు, వైయస్సార్ కంటి వెలుగు వంటి పథకాల పరోక్షంగా లబ్ది చేకూరాయని తెలిపారు. ఇవన్నీ లెక్కేస్తే మొత్తం 1 లక్ష31 వేల 725 కోట్లు రూపాయలను ఎలాంటి లంచాలు, వివక్ష లేకుండా, ప్రజల గడప వద్దకే వెళ్లి నేరుగా అందించగలిగామని తెలిపారు.
వారి సహకారంతోనే...
ప్రభుత్వంలో పని గ్రామ వాలంటీర్, సచివాలయ సిబ్బంది నుంచి కలెక్టర్ల వరకు ప్రతి ఒక్కరి సహాయ, సహకారాలతో ఇవన్నీ చేయగలిగామని సీఎం జగన్ అన్నారు. రూపొందించిన రెండు డాక్యుమెంట్లను ప్రజలందరికీ ఈరోజు వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికీ చేరడానికి శ్రీకారం చుడుతున్నట్లు వివరించారు. ఈ లేఖలో కుటుంబానికి జరిగిన మేలును వివరిస్తూ, ఈ రెండేళ్లలో మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశంలో ఏమేం చేయగలిగామనే విషయాన్ని లెక్కలతో సహా చెబుతామన్నారు. ఎన్నికలప్పుడు మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్‌లా భావించామని, అందులో చెప్పిన ప్రతి అంశాన్ని పూర్తి చేయడానికి ఈ రెండేళ్లలో అడుగులు వేసినట్లు సీఎం తెలిపారు. మేనిఫెస్టోలో చెప్పిన వాటిలో ఏమేం అమలు చేశాము? ఎన్నింటికి అడుగులు పడ్డాయి? ఏమేం ఇంకా అమలు కావాలి? ఆ వివరాలతో పాటు, మేనిఫెస్టోలో చెప్పనివి కూడా ఏమేం చేశామన్నది చెబుతూ ప్రతి ఇంటికి ఒక డాక్యుమెంట్, లేఖ పంపిస్తున్నట్లు సీఎం వివరించారు. పథకాల్లో దాదాపు 66 శాతం అక్క చెల్లెమ్మలకు పోతున్నాయని పేర్కొన్నారు. రెండేళ్లలో సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఇంకా మంచి చేస్తాం..
దేవుడి దయతో ఈ రెండు సంవత్సరాల పరిపాలన సంతృప్తికరంగా మంచి చేయగలిగామని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా ప్రభుత్వం అండగా ఉంటుందనే భరోసా ఇవ్వగలిగామన్నారు. ఇంకా మంచి చేయడానికి మీ బిడ్డగా, ముఖ్యమంత్రిగా, కుటుంబ సభ్యుడిగా మరింత తాపత్రయపడతానన్నారు. ప్రజల ఆశీస్సులతో రాబోయే మూడేళ్లు ప్రతి ఆశను నెరవేరుస్తూ అడుగులు ముందుకు వేయడానికి తగిన బలం ఇవ్వాలని దేవుడిని కోరుకుంటున్నట్లు సీఎం ట్విటర్లో తెలిపారు.
-
దేవుని దయ, ప్రజల దీవెనలతో ఈ రెండేళ్ల కాలంలో మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను, ప్రజలకు ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా నెరవేరుస్తూ వచ్చాo. ప్రజలకు నేరుగా రూ. 95,528 కోట్లు, ఇతర పథకాల ద్వారా మరో రూ. 36,197 కోట్లు మొత్తంగా రూ. 1.31 లక్షల కోట్లు అందించగలిగాం. 1/2
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 30, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">దేవుని దయ, ప్రజల దీవెనలతో ఈ రెండేళ్ల కాలంలో మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను, ప్రజలకు ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా నెరవేరుస్తూ వచ్చాo. ప్రజలకు నేరుగా రూ. 95,528 కోట్లు, ఇతర పథకాల ద్వారా మరో రూ. 36,197 కోట్లు మొత్తంగా రూ. 1.31 లక్షల కోట్లు అందించగలిగాం. 1/2
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 30, 2021దేవుని దయ, ప్రజల దీవెనలతో ఈ రెండేళ్ల కాలంలో మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను, ప్రజలకు ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా నెరవేరుస్తూ వచ్చాo. ప్రజలకు నేరుగా రూ. 95,528 కోట్లు, ఇతర పథకాల ద్వారా మరో రూ. 36,197 కోట్లు మొత్తంగా రూ. 1.31 లక్షల కోట్లు అందించగలిగాం. 1/2
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 30, 2021
ఇదీ చదవండి: