ETV Bharat / city

రంజాన్‌ నెల ప్రారంభం.. ముస్లింలకు పలువురు శుభాకాంక్షలు

Ramzan: ముస్లింలకు పవిత్రమైన రంజాన్ మాసం ఆదివారం ప్రారంభం కానుంది. శనివారం సాయంత్రం దేశంలోని పలు ప్రాంతాల్లో నెలవంక కనిపించడంతో నేటి నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభంకానున్నాయని ఫతేపుర్ మసీద్ ఇమాం ముఫ్తీ ముకర్రం అహ్మద్ తెలిపారు. రంజాన్ మాసం జరుపుకోనున్న ముస్లీంలకు సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు.

jagan and pawan wishes to muslims
రంజాన్‌ నెల ప్రారంభం సందర్భంగా ముస్లింలకు సీఎం జగన్‌, పవన్ శుభాకాంక్షలు
author img

By

Published : Apr 3, 2022, 7:58 AM IST

Ramzan: రంజాన్‌ నెల ప్రారంభమవుతున్న సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ముస్లిం సోదరులకు సీఎం జగన్‌ శుభాకాంక్షలు తెలిపారు. నెల రోజులపాటు నియమ నిష్టలతో కఠిన ఉపవాసం ఆచరించే ఈ పుణ్య రంజాన్‌ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైనదని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో కొంత భాగాన్ని పేదలకు దానధర్మాల ద్వారా ఖర్చు చేస్తూ మనిషిలోని చెడు భావాల్ని, ద్వేషాన్ని రూపుమాపేందుకు చేసే కఠోర దీక్షే రంజాన్‌ ఉపవాస దీక్ష అని వెల్లడించారు.

రంజాన్‌ ఉపవాస దీక్షలు పవిత్రం: పవన్‌ కల్యాణ్‌
పవిత్రమైన రంజాన్‌ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు జనసేన తరఫున పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ శుభాకాంక్షలు తెలిపారు. ‘నెల రోజులపాటు కఠిన ఉపవాస దీక్షలు ఆచరించే ముస్లిం సోదరులకు అల్లా దీవెనలు లభించాలని కోరుకుంటున్నా’ అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు తుది నోటిఫికేషన్‌ విడుదల చేసిన ప్రభుత్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.