తెదేపా నేతలతో సీఎం చంద్రబాబు అమరావతిలో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాబోయే 17 రోజులు అత్యంత కీలకమని చంద్రబాబు అన్నారు. ప్రచారానికి ఇంకా 15 రోజులసమయం ఉందన్నారు. ఐదేళ్లలో పేదలకు చేసిన వాటిని గుర్తు చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. తెదేపా నాయకత్వం రాష్ట్రానికి అవసరమని తెలిపారు. రాజకీయ వైరాలు మరిచి ఐక్యంగా పని చేయాలని నేతలకు సూచించారు.
సముచిత స్థానం కల్పిస్తాం...
25 ఎంపీ సీట్లు, 150కుపైగా అసెంబ్లీ సీట్లలో తెదేపా గెలుపొందాలని ఆకాంక్షించారు. పార్టీలో అందరికీ సరైన గౌరవం, గుర్తింపు ఇస్తామని స్పష్టం చేశారు. సమర్థంగా పనిచేసే వారికి సముచిత స్థానం ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. విభేదాలు మరిచి అభ్యర్థుల గెలుపుకోసం ఐక్యంగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు.
కుట్రలను చిత్తు చేయాలి...
కుట్రలు చేసి తెదేపా డేటా, కార్యకర్తల సమాచారం చోరీ చేశారని చంద్రబాబు ఆక్షేపించారు. భాజపా, తెరాస, వైకాపా కుట్రలుచిత్తు చేయాలన్నారు.ప్రలోభాలను అధిగమించి...వేధింపులు సమర్థంగా ఎదుర్కోవాలన్నారు.
తారుమారు చేయటంలో నేర్పరి...
నేరాలు-ఘోరాలకు బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డనితీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. వాళ్ల చిన్నాన్న హత్య కేసు ఆరోపణలు వాళ్ల అనుచరులపైనే ఉన్నాయన్నారు. నేరస్థులకు తప్పించుకునే అలవాటు, సాక్ష్యాలను తారుమారు చేసే అలవాటు ఉంటుందన్నారు.
వివేకానందారెడ్డి హత్య కేసులో వైకాపా నేతలు చేయని తప్పులేదన్నారు. సాక్ష్యాలను తారుమారు చేయడంలో జగన్నేర్పరి అన్నారు. నేరాలు చేయడంలో జగన్మోహన్ రెడ్డి ఆరితేరారని విమర్శించారు. నేరాల్లో అనుభవమే తప్ప, పరిపాలనలో అనుభవం జగన్‌కు లేదని ఎద్దేవా చేశారు.