రాష్ట్ర వ్యాప్తంగా పురపాలికల్లో ఆగస్టు 15 నుంచి 'క్లాప్' కార్యక్రమం (Clean AndhraPradesh Programme)) అమలు చేస్తున్నట్లు పురపాలిక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (minister botsa satyanarayana) తెలిపారు. మొదట ఈ నెల 8న ప్రారంభించాలని అనుకున్నప్పటికీ కొన్ని కారణాలతో ఆగస్టు 15 న 'క్లాప్'కు శ్రీకారం చుట్టామని వెల్లడించారు. విజయనగరం నగరపాలక సంస్థ కార్యాలయంలో కోటీ 48 లక్షల రూపాయలతో చేపట్టిన అదనపు భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి బొత్స పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. పరిశుభ్రతలో ఏపీని దేశంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దేలా క్లాప్ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు.
ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 4500 నుంచి 5000 వరకు ప్రత్యేక వాహనాలను కొనుగోలు చేశామని చెప్పారు. చెత్తశుద్ధి యంత్రాలన కూడా సిద్ధం చేశామన్నారు. పురపాలికల్లో నూతన పన్ను విధానాన్ని హడావుడిగా తీసుకురాలేదని స్పష్టం చేశారు. 15 వ ఆర్థిక సంఘం సూచనలే కాకుండా ఇతర రాష్ట్రాల్లో చేపట్టిన అధ్యాయనం ఆధారంగా కొత్త పన్ను విధానానికి రూపకల్పన చేశామన్నారు. దీనిపై త్వరలో అవగాహన సదస్సు నిర్వహిస్తామని చెప్పారు. ప్రజలపై ఏ మాత్రం భారం ఉండదని మంత్రి బొత్స.. మరోసారి పునరుద్ఘాటించారు.
ఇదీ చదవండి:
కేఆర్ఎంబీకి తెలంగాణ మరో లేఖ... త్రిసభ్య కమిటీ భేటీ వాయిదాకు వినతి