ETV Bharat / city

CJI NV Ramana Warangal Tour: ఓరుగల్లు పర్యటనకు సీజేఐ.. రామప్ప ఆలయ సందర్శన - nv ramana news

CJI NV Ramana Warangal Tour: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ రెండ్రోజులపాటు తెలంగాణలోని చారిత్రక నగరం వరంగల్‌లో పర్యటించనున్నారు. ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని సీజేఐ ఇవాళ సందర్శిస్తారు. అనంతరం రాత్రి హనుమకొండలో బస చేసి రేపు నూతనంగా నిర్మించిన పది కోర్టుల భవనాన్ని ప్రారంభిస్తారు.

CJI NV Ramana Warangal Tour
CJI NV Ramana Warangal Tour
author img

By

Published : Dec 18, 2021, 8:01 AM IST

రామప్ప ఆలయ సందర్శనకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ

CJI NV Ramana Warangal Tour: తెలంగాణలో అద్భుత శిల్పసంపదకు నిలయమైన కాకతీయ కట్టడం, యూనెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని ఇవాళ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సందర్శిస్తారు. ఆలయంలోని రుద్రేశ్వర స్వామిని సీజేఐ దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. రామప్పకు వస్తున్న జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులకు ఘనస్వాగతం పలికేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని మరింత సుందరంగా ముస్తాబుచేశారు. పడమర వైపు గేటు నుంచి ఆలయం వరకు విద్యుత్‌ కాంతులతో అలంకరించారు. రామప్ప ఆలయ సందర్శన అనంతరం సీజేఐ హనుమకొండకు వెళ్లి రాత్రి నిట్‌ కళాశాలలో బస చేస్తారు.

కోర్టు భవనాల ప్రారంభం..

Opening of court buildings: రేపు ఉదయం వరంగల్ వాసుల ఇలవేల్పు భద్రకాళీ అమ్మవారిని సీజేఐ దంపతులు దర్శించుకుంటారు. అనంతరం హనుమకొండలో కొత్తగా నిర్మించిన పదికోర్టుల భవన సముదాయాన్ని జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రారంభిస్తారు. ఎనిమిదిన్నర దశాబ్దాలుగా ప్రజలకు సేవలందిస్తున్న ఓరుగల్లు న్యాయస్థానాన్ని రూ.22 కోట్లతో ఆధునీకరించారు. ప్రవేశ ద్వారం ఆకట్టుకునేలా కాకతీయుల స్వాగత తోరణాన్ని ఏర్పాటుచేశారు.

కోర్టులంటే భయం పోవాలి..

నిర్మాణపరంగానే కాకుండా కక్షిదారుల సౌకర్యార్ధం ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టేలా కోర్టు భవనాలను నిర్మించారు. నూతన భవనంతోపాటు సీనియర్ సివిల్ న్యాయస్ధాన హాలును పోక్సో కోర్టుగా మార్చారు. లైంగిక దాడుల కేసుల విచారణ సందర్భంగా హాజరయ్యే బాధిత చిన్నారులు, వారి తల్లిదండ్రులు ఎవరికీ కనిపించకుండా ప్రత్యేక ద్వారాన్ని ఏర్పాటు చేశారు. వీరి విచారణ కోసం ప్రత్యేక గదులను ఏర్పాటు చేశారు. కోర్టులంటే భయం పోవాలనే ఆలోచనతో ప్రాంగణంలో పచ్చదనం పెంచి ఆహ్లాదంగా తీర్చిదిద్దారు. న్యాయస్థానంలో అనేక సందేశాత్మక చిత్రాలతోపాటు మహనీయుల ఫోటోలను ఏర్పాటు చేశారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు పర్యవేక్షణలో అత్యాధునికంగా రూపుదిద్దుకున్న ఈ భవనాన్ని సీజేఐ రమణ ప్రారంభించి. అనంతరం హైదరాబాద్‌కు పయనమవుతారు.

ఇదీ చదవండి:

Junior Artists Died : హైదరాబాద్​లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు సహా డ్రైవర్ మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.