ETV Bharat / city

Cinema Tickets Issue: లైసెన్స్ లేకనే థియేటర్లు మూసేశారు.. స్వచ్ఛందం కాదు: మంత్రి పేర్ని నాని - ysrcp

లైసెన్స్ లేకనే థియేటర్లు మూసేశారు
లైసెన్స్ లేకనే థియేటర్లు మూసేశారు
author img

By

Published : Dec 28, 2021, 1:49 PM IST

Updated : Dec 29, 2021, 5:24 AM IST

13:47 December 28

థియేటర్ యజమానులు, డిస్ట్రిబ్యూటర్లతో చర్చించిన మంత్రి పేర్ని నాని

లైసెన్స్ లేకనే థియేటర్లు మూసేశారు

సినిమా థియేటర్ల యజమానులు, డిస్ట్రిబ్యూటర్లతో సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని చర్చలు జరిపారు. సచివాలయంలోని 5వ బ్లాక్​లో గంటన్నర పాటు కొనసాగిన చర్చల్లో సినిమా టికెట్ల ధరలు, థియేటర్లపై తనిఖీలు అంశాలపై చర్చించారు. సినిమా టికెట్ల ధరలు పెంచకపోవడం వల్ల తాము ఎదుర్కొంటోన్న సమస్యలను సినిమా థియేటర్ల యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు మంత్రికి ఏకరువు పెట్టారు. కొవిడ్ కారణంగా తాము తీవ్రంగా ఆర్థిక ఇబ్బందులు ఎదర్కొంటున్నట్లు తెలిపారు. కష్టాల దృష్ట్యా సినిమా టికెట్ల ధరలు పెంచాలని మంత్రిని కోరారు. కేటగిరీల వారీగా ఎసీ, నాన్ ఏసీ థియేటర్లలో పలు కేటగిరీల్లో టికెట్ ధరలు పెంచాలని కోరినట్లు ప్రతినిధులు తెలిపారు. సీజ్ చేసిన థియేటర్లు తెరవకపోతే తాము తీవ్రంగా ఇబ్బందులు పడతామన్నారు.

టికెట్ల అంశంపై కమిటీ..

టికెట్ల పెంపు అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని మంత్రి నాని వెల్లడించారు. హైకోర్టు సూచనల మేరకు సినిమా టికెట్ల అంశంపై ప్రభుత్వం కమిటీని వేసిందని..,త్వరలో సమీక్ష జరిపి సమగ్ర నివేదిక ఇస్తుందని తెలిపారు. వివిధ సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను కమిటీ పరిగణనలోకి తీసుకుంటుందన్నారు. తక్కువ ధరల్లో ప్రజలకు వినోదాన్ని ఇచ్చే అంశాన్ని కమిటీ పరిశీలిస్తుందని మంత్రి తెలిపారు. సామాన్యులు ఇబ్బందులు పడకుండా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

"సినిమా టికెట్ల ధరలు పెంచాలని డిస్ట్రిబ్యూటర్లు కోరారు. టికెట్ల పెంపు అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని చెప్పాం. హైకోర్టు సూచనల మేరకు ధరలపై నిన్ననే ప్రభుత్వం కమిటీ వేసింది. కమిటీ త్వరలో రివ్యూ చేసి సమగ్ర నివేదిక ఇస్తుందని చెప్పాం. వివిధ సంఘాల విజ్ఞప్తులు కమిటీ పరిగణనలోకి తీసుకుంటుంది. తక్కువ ధరలో ప్రజలకు వినోదం ఎలా ఇవ్వచ్చో కమిటీ పరిశీలిస్తుంది. సామాన్యులు ఇబ్బందులు పడకుండా సమస్యకు పరిష్కారం."- పేర్ని నాని, మంత్రి

ఎవరిపైనా కక్ష లేదు..

సినిమా థియేటర్లపై తనిఖీలు అంశంపైనా సమావేశంలో చర్చ జరిగింది. లైసెన్సులు, తగిన పత్రాలు లేకుండా సినిమాలు నడుపుతున్న వారిపైన మాత్రమే చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. చాలా మంది ఫైర్ విభాగం నుంచి ఎన్​వోసీ, రెవెన్యూ నుంచి బీ ఫాం తెచ్చుకోకుండా, సరైన పత్రాలు లేకుండా సినిమాలు నడుపుతున్నారన్నారు. వెంటనే సంబంధిత పత్రాలు తెచ్చుకోవాలని గత సెప్టెంబరులో డిస్ట్రిబ్యూటర్లుతో జరిగిన సమావేశంలో స్పష్టం చేశారమన్నారు. అనుమతి పత్రాలు లేకుండా థియేటర్లు నడిపినవారిపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. తమకు ఎవరిపైనా కక్ష లేదన్నారు. ఇప్పటి వరకు 9 జిల్లాలో కలిపి నిబంధనలు పాటించకుండా నడపుతోన్న 130 థియేటర్లను మూసేసినట్లు మంత్రి తెలిపారు.

సిద్దార్థ్ స్టాలిన్ గురించి మాట్లాడి ఉండొచ్చు..

సినిమా టికెట్ల అంశంపై ఇటీవల సినిమా హీరోలు నాని, సిద్దార్థ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పేర్నినాని స్పందించారు. కొందరు తెలిసి మాట్లాడుతున్నారో... తెలియక మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితి ఉందన్నారు. ఏ కిరాణా కొట్టు.,సినిమా థియేటర్​ను చూసి సినీ హీరో నాని మాట్లాడారో తెలియదన్నారు. హీరో సిద్దార్థ చెన్నైలో ఉంటూ బహుశా వారి సీఎం స్టాలిన్ గురించి మాట్లాడి ఉండొచ్చని ఎద్దేవా చేశారు. హీరో సిద్దార్థ్ టాక్స్​లు అన్నీ చెన్నైలోనే చెల్లిస్తున్నారని, ఆయన ఏపీలో జరిగే వాటి గురించి ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు.

"హీరో సిద్దార్థ్‌ చెన్నైలో ఉంటారు. సిద్దార్థ్‌ వ్యాఖ్యలు స్టాలిన్ గురించి కావచ్చు. హీరో సిద్దార్థ్ మమ్మల్ని ఎప్పుడైనా చూశారా?. మా విలాసాలు హీరో సిద్దార్థ్‌ చూశారా?. హీరో సిద్దార్థ్ పన్నులన్నీ కట్టేది చెన్నైలోనే. చెన్నైలో ఉండే సిద్దార్థ్‌ ఏపీ గురించి ఎలా మాట్లాడతారు. ఏ కిరాణా కొట్టు కలెక్షన్లు చూసి హీరో నాని మాట్లాడారో తెలియదు." -పేర్ని నాని, మంత్రి

సీఎం జగన్ ఎవరితోనైనా చర్చించేందుకు సిద్ధం..

సినీ పరిశ్రమపై ఎవరితోనైనా చర్చించేందుకు సీఎం జగన్ సిద్దమని మంత్రి అన్నారు. జగన్ ప్రభుత్వానికి ఎవరిపైనా కక్ష ఉండదని, ఈ ప్రభుత్వంలో ఏ నిర్ణయమూ వ్యక్తుల కోసం జరగదన్నారు. ప్రజలకు అందుబాటులో వినోదం ఇవ్వటమే ప్రభుత్వ బాధ్యత అని మంత్రి స్పష్టం చేశారు. సినిమా పరిశ్రమపై ఎవరు ఏం చెప్పాలనుకున్నా చెప్పవచ్చన్నారు. సూచనలు, సలహాలను స్వాగతిస్తామన్నారు. ప్రభుత్వానికి ఏవేవో ఆపాదించి మాట్లాడటం ధర్మం కాదన్నారు. కొత్త సినిమా రాయితీలు ఇచ్చే విషయంలో మాకు రాగద్వేషాలు ఏవీ ఉండవన్నారు. చట్టం ,నిబంధనల ప్రకారమే ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు.

త్వరలో ఆన్‌లైన్‌ టికెటింగ్ తీసుకొస్తామని తెలిపారు. ఆన్‌లైన్‌ టికెటింగ్ వల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవని మంత్రి నాని స్పష్టం చేశారు.

టికెట్ల రేట్లు పెంచండి

కార్పొరేషన్ల పరిధిలో ఏసీ హాళ్లకు రూ.150 - రూ.50 (గరిష్ఠం-కనిష్ఠం), ఏసీలేని వాటిలో రూ.100- రూ.40 చొప్పున, ఇతర ప్రాంతాల్లోని ఏసీ హాళ్లలో రూ.100- రూ.40(గరిష్ఠం- కనిష్ఠం), ఏసీ లేని వాటిలో రూ.80- రూ.30 చొప్పున ధరలను నిర్ణయించాలి. కొత్త సినిమాల బెనిఫిట్‌ షోలకు అనుమతి ఇవ్వాలని మంత్రి నానిని కోరాం. -తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ మాజీ అధ్యక్షుడు, పంపిణీదారుల సంఘం కార్యదర్శి వీరినాయుడు

ఇదీ చదవండి:

Cinema Tickets Issue: సినిమా టికెట్ల వ్యవహారంపై కొత్త కమిటీ నియామకం

Last Updated : Dec 29, 2021, 5:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.