ETV Bharat / city

'పీవీ సునీల్​కుమార్ మా కుటుంబాన్ని వేధిస్తున్నారు.. దర్యాప్తు చేయించండి' - High Court

High Court: సీఐడీ అదనపు డీజీ సునీల్ కుమార్ మామ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ కుటుంబాన్ని సునీల్ వేధిస్తున్నారంటూ వ్యాజ్యంలో వెల్లడించారు. సునీల్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. తన కుమార్తెను శారీరకంగా, మానసికంగా వేధించడమే కాకుండాతమ కుటుంబంలోని ఇతర సభ్యులను లక్ష్యంగా చేసుకున్నారన్నారు.

High Court
High Court
author img

By

Published : Feb 27, 2022, 8:29 AM IST

High Court: సీఐడీ అదనపు డీజీ సునీల్ కుమార్ తమ కుటుంబాన్ని మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారంటూ ఆయన మామ సుబ్బారావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సునీల్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ వ్యాజ్యంలో వెల్లడించారు. తన కుమార్తెను సునీల్ వివాహం చేసుకున్న తర్వాత అధిక సొమ్ము, కారులు, వ్యవసాయ భూములు, ఆభరణాలు తీసుకురావాలంటూ డిమాండ్ చేశారన్నారు. సునీల్ వేధింపులపై తన కుమార్తె వేసిన కేసు కోర్టులో ఉందని తెలిపారు.

కేసును ఉపసంహరించుకోకుంటే.. జైలుకు పంపుతానంటూ సునీల్ బెదిరించారని సుబ్బారావు అన్నారు. తన కుమార్తెను శారీరకంగా, మానసికంగా వేధించడమే కాకుండాతమ కుటుంబంలోని ఇతర సభ్యులను లక్ష్యంగా చేసుకున్నారన్నారు. సీఐడీ అదనపు డీజీ హోదా, అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ.. అఖిల భారత సర్వీసు నిబంధనలను ఉల్లంఘిస్తూ తమ కుటుంబ సభ్యులను వేధించడాన్ని చట్టవిరద్ధమైన చర్యగా ప్రకటించాలని కోరారు. సీఐడీ కేంద్ర విజిలెన్స్ కమిషన్​తో దర్యాప్తు జరిపించాలని కోరారు. తమకు భద్రత కల్పించడం సహా సీఐడీ అదనపు డీజీ పోస్టుకు.. అన్ని విధాలా న్యాయం చేసే అధికారిని నియమించేలా కేంద్ర, రాష్ట్రాలను ఆదేశించాలని కోరారు.

ఇదీ చదవండి: HC ON SOCIAL MEDIA: అలాంటి వ్యాఖ్యలను సహించేది లేదు : హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.