ETV Bharat / city

లాక్​డౌన్​ ఎఫెక్ట్​ : చిరంజీవి బ్లడ్ బ్యాంక్​లో కనిష్ఠానికి నిల్వలు

కరోనా వైరస్ ప్రభావంతో దేశవ్యాప్తంగా రక్తనిధి కేంద్రాలు వెలవెలబోతున్నాయి. అత్యవసర శస్త్రచికిత్సలు మినహా సాధారణ చికిత్సలకు రక్తం అందించలేని పరిస్థితులు నెలకొన్నాయి. హైదరాబాద్​లోని చిరంజీవి రక్తనిధి కేంద్రం.. దాతలు లేక నిర్మానుష్యంగా మారింది. ఇక్కడ 40 నుంచి 50 యూనిట్ల రక్తం మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉండటంతో వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లాక్​డౌన్ పొడిగిస్తే రక్తం దొరకడం మరింత కష్టమవుతుందన్నారు.

author img

By

Published : Apr 11, 2020, 7:21 AM IST

chiranjeevi-blood-bank-blood
జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో అరవింద్​కుమార్ సమీక్ష

లాక్​డౌన్​ ఫలితంగా హైదరాబాద్​లోని చిరంజీవి రక్తనిధి కేంద్రంలో నిల్వలు ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి, లాక్​డౌన్ ప్రభావంతో నిల్వలు క్రమంగా పడిపోయాయి. సాధారణ రోజుల్లో బ్లడ్ బ్యాంక్ ఎప్పుడూ దాతలతో కిక్కిరిసిపోయి ఉంటుంది. అభిమాన హీరోల పుట్టిన రోజులు, కొత్త సినిమాల విడుదల సమయంలో పెద్ద సంఖ్యలో ఇక్కడ రక్తదానం చేస్తుంటారు. అలా నెలకు 600 నుంచి 650 యూనిట్ల రక్తం ఎప్పుడూ అందుబాటులో ఉండేది. కానీ కొవిడ్-19 ఆ పరిస్థితిని పూర్తిగా తలకిందులుచేసింది. రోజుకు ఒక్కరు ఇద్దరు మినహా ఎవరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావడం లేదు. ఫలితంగా చిరంజీవి రక్తనిధి కేంద్రంలో రక్త నిల్వలు 50 యూనిట్లకు పడిపోయాయి.

అన్ని క్యాంపులు రద్దు..

నగరంలోని ఒమేగా, స్టార్ ఆస్పత్రులతో ఒప్పందం కుదుర్చుకున్న చిరంజీవి రక్తనిధి కేంద్రం... ఆయా ఆస్పత్రుల్లో కేవలం అత్యవసర శస్త్రచికిత్సలకు మాత్రమే రక్తాన్ని సరఫరా చేయగలుగుతోంది. అలాగే రక్త సేకరణకు సంబంధించి ఈ వేసవిలో నిర్వహించాల్సిన అన్ని క్యాంపులను పూర్తిగా రద్దు చేశారు.

వీరి నుంచే సేకరణ..

దాతలెవరైనా సంప్రదిస్తే ప్రత్యేకంగా తయారుచేసిన రెండు ఫారాలపై వివరాలు నింపాల్సి ఉంటుంది. వ్యక్తిగత వివరాలతోపాటు దగ్గు, తుమ్ములు, జ్వరం ఏవైనా ఉన్నాయా? ఇంతకు ముందు దూర ప్రయాణాలేమైన చేశారా? చేస్తే ఎక్కడికి వెళ్లి వచ్చారు? అనే వివరాలను దాతలు పొందుపర్చాలి. అలాగే పోలీసులకు సమాచారం ఇచ్చేలా దాతల వివరాలను వాట్సప్​లో పంపిస్తూ అనుమతి తీసుకోవాలి. అనంతరం స్క్రీనింగ్ చేసి ఆరోగ్యవంతంగా ఉన్నాడని ధ్రువీకరించాకే రక్తాన్ని సేకరిస్తారు. అలాగే వయస్సు కూడా ఇక్కడ ప్రామాణికంగా తీసుకుంటున్నారు. 60 ఏళ్ల పైబడిన వారెవరి నుంచి రక్తాన్ని తీసుకోవడం లేదు.

ప్రత్యేక మార్గదర్శకాలు రావాలి..

లాక్ డౌన్ పొడిగిస్తే రక్త నిల్వల సంఖ్య మరింత పడిపోయే ప్రమాదముందని రక్త నిధి కేంద్రం వైద్యులు భావిస్తున్నారు. మెగా అభిమానుల అండతో రక్తాన్ని సేకరించేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన జాబితా తమ వద్ద సిద్ధంగా ఉందని.. ప్రభుత్వం ఇందుకోసం ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించాలని కోరుతున్నారు.

ఇవీ చూడండి-కరోనాను ఎదుర్కోవాలంటే.. ఆ ఒక్కటే ఆయుధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.