వైఎస్ వివేకా హత్య కేసుపై 24గంటల్లో సమాధానం చెప్పకపోతే సీఎం జగన్పై అనుమానపడాల్సి వస్తుందని కేంద్ర మాజీ మంత్రి, తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్ అన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో భాగంగా..ఎం.ఆర్ పల్లి, ఎయిర్ బైపాస్ రోడ్ ప్రాంతాల్లో ఆయన ప్రచారాన్ని నిర్వహించారు. వైఎస్ వివేకా హత్య.. రాజకీయ హత్యేనని ఆయన కుమార్తె దిల్లీ మీడియా మందు చెప్పిందన్న ఆమె వ్యాఖ్యలకు బాధ కలిగిందన్నారు చింతా మోహన్.
వివేకా హత్యపై సీఎం జగన్ వద్ద నిఘా నివేదికలు ఉన్నాయన్న చింతా మోహన్... వివేకా కుమార్తెకి జగన్ 24గంటల్లో కచ్చితంగా సమాధానం చెప్పి తీరాలన్నారు. ప్రధాని మోదీ సైతం ఈ అంశంపై దృష్టి సారించాలన్నారు.
ఇదీ చదవండి: