శాసనసభలో ఎనిమిది బిల్లులను ప్రవేశపెడుతున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఉదయం అసెంబ్లీ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. సీఆర్డీఏ బిల్లు కూడా సభలో పెట్టే ఆలోచన చేస్తున్నామన్నారు.
అచ్చెన్నాయుడు తప్పు చేయలేదని తెదేపా నేతలు చెప్పగలరా..? అని ప్రశ్నించారు. తెదేపా సభ్యులు నల్లచొక్కాలతో సభకు రావడం కొత్త డ్రామా అని విమర్శించారు. రూ.150 కోట్ల అవినీతిలో అచ్చెన్న పాత్ర ఉందని విచారణలో తేలిందని శ్రీకాంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: