ETV Bharat / city

సీఎంతో తూర్పు నౌకాదళ కమాండ్ ప్రధానాధికారి భేటీ

తూర్పు నౌకాదళ కమాండ్ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ అజెంద్ర బహదూర్ సింగ్ సీఎం జగన్​తో భేటీ అయ్యారు. తూర్పు నౌకాదళ కమాండ్ కార్యకలాపాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం సహకారం అందించాలని కోరారు.

Chief of the Eastern Naval Command meets with the CM
సీఎంతో తూర్పు నౌకాదళ కమాండ్ ప్రధానాధికారి భేటీ
author img

By

Published : Mar 24, 2021, 2:26 PM IST

తూర్పు నౌకాదళ కమాండ్ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ అజెంద్ర బహదూర్ సింగ్ సీఎం జగన్​తో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఈరోజు ఉదయం 10.30 గంటలకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి వచ్చిన ఆయన ముఖ్యమంత్రిని కలిశారు. తూర్పు నౌకాదళ కమాండ్ కార్యకలాపాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం సహకారం అందించాలని సీఎంను కోరారు. విశాఖలో నేవీ చేపట్టనున్న వివిధ కార్యక్రమాలను.. తూర్పు నౌకాదళ ప్రధానాధికారి ముఖ్యమంత్రికి వివరించారు. అంతకుముందు సీఎం ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం ఇచ్చి సత్కరించారు.

సీఎంతో తూర్పు నౌకాదళ కమాండ్ ప్రధానాధికారి భేటీ

అనంతరం రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో రాజ్‌భవన్‌లో తూర్పు నౌకాదళం కమాండింగ్‌ ఇన్‌ చీఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ అజేంద్ర బహూదర్‌సింగ్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. పలు అంశాలపై చర్చించారు. తనతోపాటు తూర్పునౌకాదళం ఇతర అధికారులు కూడా గవర్నర్‌తో భేటీ అయ్యారు.

ఇదీ చదవండి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ జారీ చేయలేం: ఎస్ఈసీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.