తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు కుటుంబసభ్యులతో కలిసి దిల్లీ వెళ్లనున్నారు. బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో హస్తిన బయల్దేరనున్నారు. ఇటీవల దిల్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ దంత వైద్యం చేయించుకున్నారు. వ్యక్తిగత వైద్యురాలు పూనియా ఆయనకు చికిత్స చేశారు. చికిత్సలో భాగంగా మరోసారి వైద్యులను నేడు కలవనున్నట్లు సమాచారం. ఇటీవల సీఎం సతీమణి శోభ కూడా దిల్లీ ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
ఇదీ చదవండి : 'మీ భాగస్వామితో మాటల్లేవా.. ఇలా చేస్తే మళ్లీ దగ్గరైపోతారు'