CASE ON PT USHA: పరుగుల రాణి పీటీ ఉషపై కేసు నమోదైంది. ఓ ఫ్లాట్ కోసం డబ్బులు చెల్లించగా.. తనను మోసం చేశారంటూ మరో మాజీ అథ్లెట్ జెమ్మా జోసెఫ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేరళలోని కోజికోడ్ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఉషతో పాటు మరో ఆరుగురిపైనా శుక్రవారం ఛీటింగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
JEMMA JOSEPH: కోజికోడ్‌లో ఓ ఫ్లాట్ కోసం వాయిదాల రూపంలో పీటీ ఉషకు రూ.46 లక్షలు చెల్లించినట్లు జెమ్మా జోసెఫ్ పేర్కొన్నారు. ఉష హామీ మేరకే బిల్డర్‌కు డబ్బులు చెల్లించానని.. అయితే నిర్ణీత గడువులోగా ఫ్లాట్ తనకు అప్పగించలేదన్నారు. తిరిగి డబ్బులూ ఇవ్వలేదని తెలిపారు. ఇందుకు సంబంధించి బిల్డర్‌ను సంప్రదించగా.. డబ్బులు తిరిగి చెల్లించేందుకు పీటీ ఉష బాధ్యత వహించాలని చెప్పినట్టుగా జెమ్మా జోసెఫ్ వివరించారు. అయితే పీటీ ఉష తనకు డబ్బులు తిరిగి ఇవ్వలేదని.. ఇద్దరూ కలిసి తనను మోసం చేశారని ఆరోపించారు. ఈ మేరకు పీటీ ఉష, బిల్డర్ సహా ఆరుగురిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.
ఇదీ చూడండి: Ashes 2021: యాషెస్ సిరీస్‌లో మరోసారి కరోనా కలకలం