తెలంగాణ ఎంసెట్ ఇంజినీరింగ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ వాయిదా పడింది. కళాశాలల అనుబంధ గుర్తింపు ప్రక్రియ కొలిక్కి రాకపోవడంతో ఈ నెల 4న మొదలు కావాల్సిన వెబ్ ఆప్షన్ల నమోదును వారం పాటు వాయిదా వేసినట్లు ప్రవేశాల కన్వీనర్ నవీన్ మిత్తల్ వెల్లడించారు.
ఈ నెల 4 నుంచి 11 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం ఉంటుంది. ఇంజినీరింగ్ మొదటి విడత సీట్లను ఈ నెల 18న కేటాయించనున్నారు. ధ్రువపత్రాల పరిశీలన ఈ నెల 4 నుంచి 11 వరకు యథాతథంగా కొనసాగనుంది. ధ్రువపత్రాల పరిశీలన కోసం ఇప్పటికే ప్రారంభమైన స్లాట్ బుకింగ్ ప్రక్రియ.. ఈ నెల 9 వరకు ఉంటుంది. ధ్రువపత్రాల పరిశీలన కోసం ఇప్పటి వరకు సుమారు 28 వేల మంది స్లాట్ బుకింగ్ చేసుకున్నారు. మొదటి విడతలో సీటు పొందిన అభ్యర్థులు ఈ నెల 19 నుంచి 23 వరకు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని నవీన్ మిత్తల్ తెలిపారు.
వెయిటేజీ తొలగింపు..
గత నెల 4, 5, 6 తేదీల్లో ఇంజినీరింగ్, 9, 10 తేదీల్లో వ్యవసాయ, ఫార్మా కోర్సుల ప్రవేశాలకు ఎంసెట్ నిర్వహించారు. ఇంజినీరింగ్ విభాగానికి 1,47,986 మంది హాజరయ్యారు. ఈ ఏడాది 45 శాతం మార్కుల నిబంధన ఎత్తేసిన సర్కారు... ఇంటర్ ఉత్తీర్ణులైన వారంతా ఇంజినీరింగ్ ప్రవేశాలకు అర్హులని ప్రకటించింది. ఎంసెట్ ర్యాంకులో ఇంటర్, సీబీఎస్ఈ మార్కులకు వెయిటేజీ తొలగించారు.
ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ఇదే..
ఆగస్టు 30 నుంచి ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ తొలి విడత ప్రక్రియ ప్రారంభం కాగా.. అదేరోజు నుంచి సెప్టెంబర్ 9 వరకు ధ్రువపత్రాల పరిశీలనకు ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ నెల 4 నుంచి 11 వరకు ధ్రువపత్రాల పరిశీలన.. 4 నుంచి 13 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం ఇచ్చారు. సెప్టెంబరు 15న తొలి విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు.. 15 నుంచి 20 వరకు ఆన్లైన్లో విద్యార్థులు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉండగా.. ప్రస్తుతం ఈ షెడ్యూల్లో మార్పులు జరిగాయి.
ఏపీ విద్యార్థుల సత్తా..
మరోవైపు తెలంగాణ ఎంసెట్ (TS EAMCET RESULTS) ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు సత్తా చాటారు. ఇంజినీరింగ్‌లో తొలి రెండు ర్యాంకులు సహా టాప్-10లో ఆరు ర్యాంకులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులే కైవసం చేసుకున్నారు.
సంబంధిత కథనాలు..
Engineering Counselling: ఇంజినీరింగ్ కొత్త విధానమేంటి? కౌన్సెలింగ్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?
TS EAMCET RESULTS: ఎంసెట్ ఫలితాలు విడుదల... ర్యాంకులను ఇలా చూసుకోండి
TS Engineering Counseling: ఎంసెట్, ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారు