వందల తాడిచెట్లు కొట్టేసి ప్రభుత్వం గీత కార్మికులకు జీవనాధారం లేకుండా చేసిందని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో 1500 తాడిచెట్లు, 500 ఈత చెట్లు కూల్చివేయటాన్ని ఆయన తప్పుబట్టారు. మూడు తరాల గీత కార్మికులకు జీవనాధారమై తాడిచెట్లను ప్రభుత్వం జేసీబీలతో కూల్చేసిందని విమర్శించారు. చెట్లు కూల్చేసి 400 కుటుంబాలకు జీవనాధారం లేకుండా చేశారన్నారు. నిన్నటివరకు ఇళ్ల స్థలాల పేరుతో ఎస్సీల భూములు లాక్కున్నారన్న చంద్రబాబు... ఇప్పుడు గీతకార్మికుల పొట్టకొట్టారన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలపై ప్రభుత్వం అహంకారపూరిత చర్యలకు పాల్పడుతుందన్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరగాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతి గీత కార్మికుని కుటుంబానికి న్యాయం జరిగేవరకూ తెదేపా పోరాడుతుందని ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి: