కొన్ని రోజులుగా తెలంగాణలోని ములుగు ఎమ్మెల్యే సీతక్క(seethakka) తల్లి అనారోగ్యంతో బాధపడుతోంది. హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రిలో అత్యవసర విభాగంలో చికిత్స పొందుతోంది. ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు(chandrababu).. ఏఐజీ ఆస్పత్రికి వచ్చారు. సీతక్క(seethakka)తో మాట్లాడారు. ఆమె మాతృమూర్తి సమ్మక్క ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదని.. ఆమె పూర్తి ఆరోగ్యవంతురాలుగా బయటపడతారంటూ చంద్రబాబు(chandrababu).. సీతక్కకు ధైర్యం చెప్పారు.
ఇదీచూడండి:
Strike Notice: ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చిన జూనియర్ రెసిడెంట్ వైద్యులు