కరకట్ట వద్ద తాను నివసించే ఇంటిపై డ్రోన్లు ఎగరటంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా ఎస్పీ, డీజీపీతో ఆయన ఫోన్లో మాట్లాడారు. హై సెక్యూరిటీ జోన్‌లో డ్రోన్లు ఎగరేయటమేంటని వారిని తెదేపా అధినేత నిలదీశారు. డ్రోన్లు ఎగరేస్తున్న వ్యక్తులెవరు?.. అనుమతులు ఎవరిచ్చారు? అని ప్రశ్నించారు. "డీజీపీ, రాష్ట్ర ప్రభుత్వం అనుమతుల్లేకుండా డ్రోన్లు ఎగరేయడానికి వీల్లేదు. అన్ని అనుమతులతోనే డ్రోన్లు ఎగరేస్తున్నారా?.. నేను ఉండే నివాసంపై డ్రోన్లతో నిఘా పెట్టిందెవరు?. చివరికి నా భద్రతనే ప్రశ్నార్థకంగా మారుస్తారా?" అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ డ్రోన్లలో ఏముందో, పట్టుబడింది ఎవరో తెలియజేయాలి స్పష్టం చేశారు. నిఘా వేసిందెవరో, దాని వెనుక కుట్ర ఏంటో చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
సంబంధిత కథనం