ఆళ్లగడ్డలో యురేనియం తవ్వకాలపై తెదేపా అధినేత చంద్రబాబు స్పందించారు. తవ్వకాలు జరుపుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. ప్రజల ఆందోళనను ప్రభుత్వం ఎందుకు అర్థం చేసుకోవడం లేదన్న ఆయన..తవ్వకాలకు వ్యతిరేకంగా జరిగిన భేటీకి వైకాపా నేతలు ఎందుకు డుమ్మా కొట్టారని దుయ్యబట్టారు. రేపు ఓబుళాపల్లెలో జరిగే అఖిలపక్ష పోరుకు ప్రభుత్వం మద్దతు ఉందా.. లేదా అని అడిగారు. వైఎస్ హయాంలో అనుమతులిచ్చి నల్లమలకు ముప్పుతెచ్చారని ఆరోపించారు. జగన్ ఏమీ పట్టించుకోకుండా ప్రజలు, రైతులకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.
'ఆళ్లగడ్డ యురేనియం తవ్వకాలపై ప్రభుత్వ వైఖరి ఏంటి?'
ఆళ్లగడ్డలో యురేనియం తవ్వకాలు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ప్రజల ఆందోళనను ప్రభుత్వం ఎందుకు అర్థం చేసుకోవడం లేదని ప్రశ్నించారు.
ఆళ్లగడ్డలో యురేనియం తవ్వకాలపై తెదేపా అధినేత చంద్రబాబు స్పందించారు. తవ్వకాలు జరుపుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. ప్రజల ఆందోళనను ప్రభుత్వం ఎందుకు అర్థం చేసుకోవడం లేదన్న ఆయన..తవ్వకాలకు వ్యతిరేకంగా జరిగిన భేటీకి వైకాపా నేతలు ఎందుకు డుమ్మా కొట్టారని దుయ్యబట్టారు. రేపు ఓబుళాపల్లెలో జరిగే అఖిలపక్ష పోరుకు ప్రభుత్వం మద్దతు ఉందా.. లేదా అని అడిగారు. వైఎస్ హయాంలో అనుమతులిచ్చి నల్లమలకు ముప్పుతెచ్చారని ఆరోపించారు. జగన్ ఏమీ పట్టించుకోకుండా ప్రజలు, రైతులకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.
TAGGED:
ఆళ్లగడ్డలో యురేనియం తవ్వకాలు