పార్టీ నేతలతో తెదేపా అధినేత చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో ఇసుక వారోత్సవాల నిర్వహణ సిగ్గుచేటని విమర్శించారు. ఇసుకాసురుల భరతం పట్టే వారోత్సవాలు జరపాలని పిలుపునిచ్చారు. వాళ్ల భరతం పడితేనే పేదలకు దీపావళి అని వ్యాఖ్యానించారు. ఇసుక కొరతతో ఆరుగురు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్న చంద్రబాబు... మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని నేతలకు సూచించారు. తెలంగాణలో లేని ఇసుక కొరత ఏపీలోనే ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. ఇసుక నియంత్రణ పేరుతో వైకాపా నేతల జేబులు నింపుతున్నారని ఆరోపించారు. ఆత్మహత్యలకు ప్రేరేపించే పాలసీలు తెస్తారా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. సొంత ఊళ్లో వాగు ఇసుక తీసుకెళ్లడానికి అనుమతి కావాలా అని దుయ్యబట్టారు. పనులు కోల్పోయినవారికి ప్రభుత్వం నెలకు రూ.10 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మిక సంఘాలతో కలిసి ఉమ్మడి కార్యాచరణను రూపొందించాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. మానవ హక్కుల కమిషన్ ఎదుటే వైకాపా నేతల దౌర్జన్యాలు బయటపడ్డాయని అన్నారు. అనంతపురం జిల్లా వెంకటాపురంలో అడ్డుగోడలపై ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు చేయాలని నేతలకు సూచించారు.
ఇదీ చదవండి: