ETV Bharat / city

chandrababu slams on cm jagan:'గేటుకు గ్రీజే వేయలేని సీఎం మూడు రాజధానులు ఎలా కడతారు' - AP NEWS

chandrababu on cm jagan: ఓట్లేసిన పాపానికి ముఖ్యమంత్రి జగన్‌.. ప్రజల ప్రాణాలు బలిగొంటున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. అన్నమయ్య ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వ జవాబుదారీతనం గురించి కేంద్ర మంత్రి ప్రశ్నించిన తీరుకు సీఎం ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. గేటుకు గ్రీజు వేయలేని సీఎం.. మూడు రాజధానులు కడతారా? అని చంద్రబాబు ప్రశ్నించారు.

chandrababu slams on ysrcp
చంద్రబాబు
author img

By

Published : Dec 4, 2021, 3:50 PM IST

Updated : Dec 5, 2021, 2:11 AM IST

chandrababu on cm jagan: రాష్ట్ర ప్రజలు వరదల్లో ఇబ్బంది పడుతుంటే.. ముఖ్యమంత్రి మాత్రం ప్రశాంతంగా ఉంటున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విమర్శించారు. జగన్ పరామర్శలో.. జనాలు ఎవరినీ బయటకు రానీయకుండా అడ్డుకుంటున్నారన్న సీఎం.. బాధితులకంటే ఎక్కువ పోలీసులనే పెట్టి ఓదార్పు చేస్తున్నారని మండిపడ్డారు. పెన్నా నదిలో కరకట్టలకు ప్రమాదం జరిగేలా ఇసుక తవ్వకాలు జరిపారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఈ స్థాయి వరదలు ఉంటే.. సీఎం సిగ్గులేకుండా నాడు పెళ్లికి పోయారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరొకరైతే ఇలాంటి ఘటనకు సిగ్గుతో తల వంచుకుంటారన్నారు. ఒక మూసలావిడ నవ్వుతూ సీఎంను పొగిడింది అని చెపుతున్నారు.. ఇది జగన్ తరహా రాజకీయమని చంద్రబాబు ఎద్దేవా చేశారు. వరదలకు ప్రాణాలు, ఆస్తులు పోయి ఉంటే.. జనం జగన్​ను చూసి మురిసిపోతారా..? స్వాగతం పలుకుతారా? అని నిలదీశారు.

ప్రజల ప్రాణాలు పోవడానికి కారణమైన జగన్ ముఖ్యమంత్రి పదవిలో ఉండడానికి అనర్హులని అన్నారు. తుమ్మల కుంట చెరువును క్రికెట్ స్టేడియంలా మార్చారని, దీనికి ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. ఒక్క నెల్లూరులోనే 2 వేల కోట్ల నష్టం జరిగిందని.. ప్రాణాలకు రక్షణ కాదు.. డెడ్ బాడీ కూడా ఇవ్వలేని ప్రభుత్వం వైకాపా ప్రభుత్వమని దుయ్యబట్టారు.

కేంద్ర మంత్రి ప్రకటనకు ఏం చెపుతారు..?
chandrababu on floods: ప్రభుత్వ అసమర్థత, తప్పిదాల వల్లనే వరదల్లో 62 మంది చనిపోయారని బాబు ఆరోపించారు. రూ. 6వేల కోట్ల విలువైన పంట, ఆస్తి నష్టం జరిగిందని అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వానికి వళ్లంతా ఇగో అన్న ఆయన... అందుకే వైకాపా ప్రభుత్వ చర్యలను తుగ్లక్ చర్యలు అన్నామన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ప్రాణ నష్టం అని కేంద్ర మంత్రి చేసిన ప్రకటనకు ఏమి సమాధానం చెపుతారని చంద్రబాబు ప్రశ్నించారు. తెలిసో...తెలియకో ఓట్లు వేసిన పాపానికి ప్రజల ప్రాణాలు బలిగొంటారా అంటూ మండిపడ్డారు. జ్యుడీషియల్ ఎంక్వయిరీ అడిగితే ఎందుకు అంగీకరించలేదని చంద్రబాబు నిలదీశారు.

గేటుకు గ్రీజు వేయలేని సీఎం.. మూడు రాజధానులు కడతారా?

సీఎం పైశాచికానందం..
గతేడాది వరదలు వచ్చినప్పుడు కూడా అన్నమయ్య ప్రాజెక్టు ఐదో గేటు పని చేయలేదని చంద్రబాబు గుర్తుచేశారు. అప్పుడు మూడు గేట్లు పని చేయకుంటే రెండు గేట్లని రిపేర్ చేయించి, ఓ గేట్ వదిలేశారని.. దాని కారణంగానే అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయిందన్నారు. వర్షాల సమయంలో తమను ఎవ్వరూ హెచ్చరించలేదని నా పర్యటన సందర్భంగా బాధితులు చెప్పారని బాబు గుర్తుచేశారు. ఒకే కుటుంబంలో 9 మంది చనిపోయారని చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. 330 మీటర్ల కరకట్ట కొట్టుకెళ్లిందన్నారు. గత నెల 19న వరద వచ్చి ప్రాజెక్టు కొట్టుకుపోతే.. కుప్పంలో ఓడిపోయారు కాబట్టి తన మొహం చూడాలంటారా? అంటూ విమర్శించారు. సీఎం పైశాచికానందం పొందారని చంద్రబాబు మండిపడ్డారు.

గేటుకు గ్రీజు వేయలేని సీఎం మూడు రాజధానులు కడతారా?
గేటుకు గ్రీజు వేయలేని సీఎం మూడు రాజధానులు కడతారా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఏడాది కాలంగా గేట్ రిపేర్ చేయించలేకపోయారని మండిపడ్డారు. ప్రకృతి వైపరీత్యంలో ఖర్చు పెట్టాల్సిన రూ. 1100 కోట్లను నిధులను కూడా మళ్లించారని దుయ్యబట్టారు. విశాఖలో ఎల్జీ పాలిమర్స్ తప్పిదం వల్ల చనిపోతే.. కోటి రూపాయలు నష్ట పరిహరం ఇచ్చారన్నారు. వరద మృతుల కుటుంబాలకు కూడా కోటి రూపాయలు నష్టపరిహరం ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

తెదేపా వచ్చిన వెంటనే ఉచిత పట్టాలు..
Chandrababu on OTS Scheme: ఓటీఎస్ అమలు చేసే హక్కు ఈ సీఎంకు ఎవరిచ్చారని చంద్రబాబు నిలదీశారు. ఓటిఎస్‌ పథకం మంచి కార్యక్రమమని సీఎం ఎలా చెపుతారని మండిపడ్డారు. గత ప్రభుత్వాలు కట్టించిన ఇళ్లకు ఇప్పుడు హక్కు ఇచ్చేదేంటని మండిపడ్డారు. తెదేపా వచ్చిన వెంటనే ఉచితంగా పట్టాలు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ వర్శిటీ వీసీని చూస్తోంటే బాధేస్తోందన్న ఆయన... అంతగా బాధపడేకంటే రాజీనామా చేసి వెళ్లిపోవచ్చుగా అని అన్నారు. పిల్లల ఫీజులను కూడబెట్టిన కార్పస్ ఫండ్​ను తీసేసుకుంటారా అని ప్రశ్నించారు. రోజుకో రూపాయి చెల్లించి కూడబెట్టుకున్న అభయ హస్తం డబ్బులను గుంజుకుంటారా అంటూ దుయ్యబట్టారు. అనునిత్యం మడమ తిప్పుతూనే ఉంది ఈ ప్రభుత్వమని చంద్రబాబు విమర్శించారు. మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్.. ఇప్పుడు మెడలు దించేశారే? అని ప్రశ్నించారు.

ప్రజల్లో ఆందోళన..
ఇంత విపత్తు జరిగితే సీఎం పెళ్లిళ్లకు వెళ్తారా అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు. అన్నమయ్య ప్రాజెక్టు వద్దని అక్కడి ప్రజలు గగ్గోలు పెడుతున్నారన్నారు. ఇప్పుడు కాకున్నా.. 20 ఏళ్ల తర్వాతైనా తమ పిల్లలు చనిపోతారని భయపడుతున్నారన్నారు. ప్రభుత్వం తీరు వల్ల ప్రాజెక్టులు వద్దనే పరిస్థితికి ప్రజలు వచ్చారన్న చంద్రబాబు.. ప్రజలంతా ఇలాగే భావిస్తే ప్రాజెక్టులు కట్టగలమా అని ప్రశ్నించారు.

బేతంచర్లలోని పార్టీ నేతలతో చంద్రబాబు సమీక్ష

ఈ మేరకు బేతంచర్లలోని తెదేపా నేతలతో చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా.. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే వైకాపాకు డిపాజిట్లు కూడా రావని చంద్రబాబు అన్నారు. తన రాజకీయ జీవితంలో చూడని ఎన్నికల వ్యవస్థను ఇప్పుడు చూస్తున్నామని చంద్రబాబు వ్యాఖ్యానించారు. గతంలో గెలిచిన తర్వాత క్యాంపులు పెట్టేవారు.. ప్రస్తుతం నామినేషన్లకూ క్యాంపులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని విమర్శించారు.

పెనుకొండ ఫలితంపై సమీక్ష..
అనంతపురం జిల్లా పెనుకొండ ఫలితంపై చంద్రబాబు సమీక్షించారు. జిల్లా నేతల సమన్వయ లోపం వల్లే పెనుకొండ పురపాలికలో ఆశించిన ఫలితాలు రాలేదని చంద్రబాబు అన్నారు. అధికార పార్టీ నేతలు అక్రమ కేసులు పెట్టి తాత్కాలిక ఆనందం పొందుతున్నారని దుయ్యబట్టారు.

ఇదీ చదవండి..JAWAD CYCLONE: దిశ మార్చుకున్న జవాద్​.. ఒడిశా వైపు పయనం

Last Updated : Dec 5, 2021, 2:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.