వల్లభనేని వంశీ రాజీనామా లేఖపై తెదేపా అధినేత చంద్రబాబు స్పందించారు. వాట్సాప్ ద్వారా వంశీ లేఖ అందిందని తెలిపారు. స్థానిక వైకాపా నేతల కక్ష సాధింపు వల్లే వంశీ రాజీనామా చేస్తున్నట్లు చెప్పారని అన్నారు.
రాజీనామా చేయడం, రాజకీయాల నుంచి వైదొలగడం సమస్యకు పరిష్కారం కాదు. అప్రజాస్వామిక విధానాలపై కలిసికట్టుగా పోరాడాలి. అలా చేయటం మన బాధ్యతగా గుర్తించాలి . వ్యక్తిగతంగా, పార్టీ పరంగా వంశీ వెనక నేనుంటాననే హామీ ఇస్తున్నాను . కేడర్‌కు అన్యాయం జరగకుండా ఎందాకైనా పోరాడేందుకు సిద్ధం. ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ పోరాడుతూ ముందుకు వెళ్దాం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా నాయకులపై జరుగుతున్న కక్షసాధింపులపై వివిధ రూపాల్లో పోరాటం చేస్తున్నాం. అనైతిక చర్యలకు ముగింపు పలికే వరకు దీనిని కొనసాగిద్దాం.
- చంద్రబాబు నాయుడు, తెదేపా అధినేత
ఇదీ చదవండి: