తిరుపతిలో చేపట్టిన 104, 108 వాహనాల రథయాత్ర ప్రారంభ సమావేశం ఏర్పాట్లలో అనుకోని ఘటన జరిగింది. సమావేశ వేదికకు పక్కన ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పక్కన కొంచెం చిన్నదిగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫొటో పెట్టారు. ఫ్లెక్సీకి మరో వైపు దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, వైఎస్ జగన్ ఫొటోలు ఉన్నాయి.
