ETV Bharat / city

ప్రధాని నరేంద్ర మోదీకి చంద్రబాబు లేఖ...ఎందుకంటే! - Chandrababu Naidu latest news

వాల్మీకి, బోయ కులాలను షెడ్యూల్డ్ తెగలలో చేర్చాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌ మైదాన ప్రాంతాల్లో నివసిస్తున్న వాల్మీకి, బోయలు పేదరికంతో బాధపడుతున్నారని లేఖలో పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీకి చంద్రబాబు లేఖ
ప్రధాని నరేంద్ర మోదీకి చంద్రబాబు లేఖ
author img

By

Published : Oct 20, 2021, 4:48 PM IST

వాల్మీకి, బోయ కులాలను షెడ్యూల్డ్ తెగలలో చేర్చాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌ మైదాన ప్రాంతాల్లో నివసిస్తున్న వాల్మీకి, బోయలు పేదరికంతో బాధపడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. ఈ వర్గాలు సాంప్రదాయకంగా వేట, అటవీ ఉత్పత్తులు సేకరించడం ద్వారా తమ జీవనోపాధిని కొనసాగిస్తున్నాయని తెలిపారు. 2016లో ఆంధ్రప్రదేశ్‌లో వాల్మీకి, బోయల స్థితిగతులపై సమగ్ర అధ్యయనం చేసేందుకు ప్రొఫెసర్ సత్యపాల్ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందన్న చంద్రబాబు.. విస్తృతమైన ఫీల్డ్ వర్క్ ఆధారంగా ఒక సంవత్సరం పాటు చేసిన వివరణాత్మక పరిశోధన తర్వాత వాల్మీకి, బోయలను షెడ్యూల్డ్ తెగగా గుర్తించడంలో జాప్యం జరిగిందని కమిటీ గుర్తించిందన్నారు.

ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ కమిషన్.. వివిధ జిల్లాల్లో పర్యటించి వాల్మీకులు, బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాల్సిన అవసరం ఉందని నిర్ధారించిందని వెల్లడించారు. వాల్మీకి, బోయలను షెడ్యూల్డ్ తెగల జాబితాలో చేర్చడానికి వివిధ కమిషన్లు చేసిన సిఫార్సులను లేఖలో తమ దృష్టికి తీసుకొస్తున్నామన్నారు. 1961లో సెన్సస్ కమిషన్ కు చెందిన డిప్యూటీ రిజిస్ట్రార్ జనరల్ రాయ్ బర్మన్ వాల్మీకి, బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని సిఫారసు చేశారని గుర్తు చేశారు.

1961-62లో ఆంధ్రప్రదేశ్ ట్రైబ్స్ ఎంక్వైరి కమిషన్ వాల్మీకి, బోయలను భూమిపుత్రులుగా నిర్ధారించి ఎస్టీలుగా గుర్తించాలని సూచించిందని పేర్కొన్నారు. తరువాత అనంతరామ కమిషన్ అనుకూలమైన సిఫార్సులు చేసినప్పటికీ వాల్మీకి, బోయలను ఎస్టీ జాబితాలో చేర్చలేదని తెలిపారు. రాయలసీమ, కోస్తా ఆంధ్రలోని వాల్మీకి, బోయలు ఒకటేనని పేర్కొంటూ 1964 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని అన్నారు.

1991లో భారత ప్రభుత్వం వాల్మీకులు, నాయక్, నాయక, బేడా, బేడార్ మొదలైన ఉప సమూహాలను ఎస్టీ జాబితాలో చేర్చిందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్​లోని రాయలసీమ ప్రాంతంలో వాల్మీకులు, బోయలు సాంప్రదాయకంగా బలమైన సామాజిక, వైవాహిక సంబంధాలు కలిగి ఉన్నారన్నారు. కర్ణాటకలో వీరిని ఎస్టీ జాబితాలో చేర్చారని...కానీ ఆంధ్రప్రదేశ్‌లో వాల్మీకులు, బోయల స్థితి గందరగోళంగా ఉందని వివరించారు.

వాల్మీకీ, బోయల దశాబ్దాల పోరాటానికి సంఘీభావంగా వారిని ఎస్టీ జాబితాలో చేర్చాలని తెదేపా కృతనిశ్చయంతో ఉందన్న చంద్రబాబు.. వారి న్యాయమైన ఆకాంక్షలను నెరవేర్చాలని వారి తరపున, భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించడం ఒక గొప్ప విషయంగా తాను భావిస్తున్నానన్నారు. గత మూడు సంవత్సరాలుగా సమస్య అపరిష్కృతంగా మిగిలిపోవడంతో ఈ వివరణాత్మక అభ్యర్థనను పంపుతున్నట్లు వివరించారు. మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా, ఈ అభ్యర్థనకు సానుకూలమైన స్పందన వస్తుందని ఆశిస్తున్నానన్నారు. పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని వాల్మీకులు, బోయలను ఎస్టీలుగా గుర్తించాలని ప్రధానిని కోరారు.

ప్రధాని నరేంద్ర మోదీకి చంద్రబాబు లేఖ
ప్రధాని నరేంద్ర మోదీకి చంద్రబాబు లేఖ

ఇదీ చదవండి:

Chandrababu: వైకాపా దాడులకు వ్యతిరేకంగా చంద్రబాబు దీక్షాస్త్రం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.