ETV Bharat / city

CBN -MODI: అప్పుడప్పుడు దిల్లీకి రండి.. చంద్రబాబుతో ప్రధాని మోదీ

author img

By

Published : Aug 7, 2022, 8:30 AM IST

CBN -MODI: ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం జాతీయ కమిటీ సమావేశం ముగిశాక చంద్రబాబు ప్రధానితో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. చంద్రబాబు దగ్గరకు వచ్చినప్పుడు కొద్దిసేపు పక్కకు జరిగి ఇద్దరూ 5 నిమిషాలపాటు మాట్లాడుకున్నారు. ‘మీరీ మధ్య దిల్లీకి రావడంలేదు. అప్పుడప్పుడూ వస్తూ ఉండండి’ అని బాబుతో ప్రధాని అన్నట్లు తెదేపా వర్గాలు తెలిపాయి.

CBN -MODI
CBN -MODI

CBN -MODI: రాష్ట్రపతి భవన్‌ సాంస్కృతిక మందిరంలో జరిగిన ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం జాతీయ కమిటీ సమావేశం ముగిశాక చంద్రబాబు ప్రధానితో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. హాజరైన ప్రముఖులంతా తేనీరు సేవిస్తుండగా, ప్రధాని అందరి వద్దకు వచ్చి పలకరించినట్లు తెలిసింది. చంద్రబాబు దగ్గరకు వచ్చినప్పుడు కొద్దిసేపు పక్కకు జరిగి ఇద్దరూ 5 నిమిషాలపాటు మాట్లాడుకున్నారు. ‘మీరీ మధ్య దిల్లీకి రావడంలేదు. అప్పుడప్పుడూ వస్తూ ఉండండి’ అని బాబుతో ప్రధాని అన్నట్లు తెదేపా వర్గాలు తెలిపాయి. ఈసారి దిల్లీకొచ్చినప్పుడు ప్రత్యేకంగా కలుస్తానని చంద్రబాబు చెప్పగా, ‘తప్పకుండా రండి. ఇది మీ ఇల్లు అనుకోండి. రావాలనుకున్నప్పుడు ముందుగా మా ఆఫీసుకు చెప్పండి’ అన్నట్లు సమాచారం. చంద్రబాబు కుటుంబసభ్యుల యోగక్షేమాలను అడిగినట్లు తెలిసింది. కేంద్ర మంత్రులు అమిత్‌ షా, గడ్కరీ తదితరులతోనూ బాబు ప్రత్యేకంగా మాట్లాడారని తెదేపా వర్గాలు చెప్పాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.