ప్రజల ప్రాణాలు కాపాడేందుకు పోరాడుతున్న అత్యవసర సేవల సిబ్బందికి కావాల్సిన వైద్య పరికరాలు, శానిటేషన్ కిట్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అందజేయాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ఎన్ 95 మాస్క్‌లు, చేతి తొడుగులు, మెడికల్ మాస్క్‌లు, ఫుల్ స్లీవ్ గౌన్లు, ఐ షీల్డ్ గాగుల్స్, శానిటైజర్లు తక్షణమే అందజేయాలన్నారు. మరింత మెరుగైన సేవలను కరోనా బాధితులకు అందించేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని సూచించారు. రాజకీయాలకు అతీతంగా సమష్టిగా కరోనాపై పోరాడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
సమిష్టి కృషే ఏకైక మార్గం: చంద్రబాబు
టీడీఎల్పీ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు.. కరోనా మహమ్మారిపై పోరాటంలో తెదేపా రాజకీయాలకు అతీతంగా ప్రజల పట్ల పూర్తి అంకితభావంతో భాగస్వామి అవుతుందని స్పష్టం చేశారు. ప్రజలను కాపాడటంలో ముందుండి పోరాడే యోధులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాలన్నారు. డాక్టర్లు, వైద్య ఆరోగ్య సిబ్బంది, పోలీసు అధికారులు, కానిస్టేబుళ్లు, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా కరోనాపై చేస్తున్న పోరాటాన్ని ఆయన అభినందించారు. నిత్యావసరాలు, కూరగాయలు రవాణా, సరఫరాలో నిమగ్నమైన అందరికీ అభినందనలు తెలిపారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో కరోనా మహమ్మారిని ఎదుర్కొవడానికి అన్నివర్గాల సంఘీభావం, సమిష్టి సహకారమే ఏకైక మార్గమని స్పష్టం చేశారు. చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్‌లో తెదేపా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: