వైకాపా పాలనలో బలహీనవర్గాలపై దమనకాండ కొనసాగుతోందని తెదేపా అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. బలహీనవర్గానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని వైకాపా నేత నమ్మించి మోసగించాడని మండిపడ్డారు. అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేసిందనే కోపంతో.. ముదినేపల్లిలోని మచ్చా ధనలక్ష్మి ఇంటిని వైకాపా నాయకులు తగలబెట్టారన్నారు.
ప్రాణాపాయం నుండి బయటపడిన ఆ కుటుంబం సర్వస్వం కోల్పోయిందని అన్నారు. అధికార పార్టీ అహంకార ధోరణి వలన 15 నెలల పాలనలో బలహీనవర్గాలపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయని ఆగ్రహించారు. ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: