అమరావతి ఉద్యమం 250వ రోజుకు చేరిన సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు మద్దతు తెలిపారు. అమరావతి నిరసనలో పాల్గొన్న రైతాంగానికి సంఘీభావం తెలపాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. రాజకీయాలకు అతీతంగా పార్టీలు, ప్రజాసంఘాలు, 13 జిల్లాల ప్రజలు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.
మూడు రాజధానుల అంశంపై అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు రావాలని తెదేపా డిమాండ్ చేస్తే అధికార వైకాపా ముందుకు రాలేదని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా... ప్రభుత్వానికి కనువిప్పు కలగకపోవడం శోచనీయమని దుయ్యబట్టారు.
గతంలో రాజధాని నడిబొడ్డున ఉండాలని... అమరావతిని స్వాగతిస్తున్నామని చెప్పిన జగన్... ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరించటం తగదన్నారు. గత ప్రభుత్వాల అభివృద్ధిని కొనసాగించాలే తప్ప... నాశనం చేయడం సరికాదని చంద్రబాబు హెచ్చరించారు. ఒక వ్యక్తి మీదో, పార్టీ మీదో, వ్యవస్థ మీదో కక్షతో సమాజాన్ని నాశనం చేస్తామంటే రాష్ట్ర ప్రజలు సహించరని వ్యాఖ్యానించారు. ఇకనైనా వైకాపా ప్రభుత్వం మొండితనం మాని.. మూడు ముక్కలాట చర్యలకు స్వస్తి చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి