ETV Bharat / city

అర్హులకు ఇళ్లు ఇవ్వమంటే.. అక్రమ అరెస్టులా? : చంద్రబాబు - చంద్రబాబు తాజా వార్తలు

తెదేపా హయాంలో నిర్మించిన ఇళ్లను వెంటనే అర్హులకు అందించాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు డిమాండ్​ చేశారు. ఇళ్లు కేటాయించాలని తెదేపా చేపట్టిన ఆందోళనలో అరెస్టు చేసిన నేతలను విడుదల చేయాలని డిమాండ్​ చేశారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అరెస్టును చంద్రబాబు ఖండించారు.

చంద్రబాబు
చంద్రబాబు
author img

By

Published : Jul 8, 2020, 6:46 AM IST

మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తితో సహా పలువురు తెలుగుదేశం నాయకులను అక్రమంగా అరెస్టు చేశారని తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో కట్టిన ఇళ్లు ఏ స్థాయిలో ఉన్నాయో చూడటానికి తెదేపా నాయకులు వెళ్లడం నేరమా అని ప్రశ్నించారు. ఇళ్లు కట్టి 13 నెలలైనా పేదలకు కేటాయించకపోవడం ప్రభుత్వ తప్పిదం కాదా? అని నిలదీశారు.

బండారు సత్యనారాయణ మూర్తిని మంగళవారం రాత్రి ఏడున్నర గంటల దాకా పోలీసు స్టేషన్​లో అక్రమంగా నిర్బంధించారని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టు చేసిన తెదేపా నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. తెదేపా ప్రభుత్వం కట్టిన ఇళ్లను వెంటనే పేదలకు అందజేసి హౌసింగ్​ పెండింగ్ బిల్లులను తక్షణమే చెల్లించాలన్నారు.

ఇదీ చదవండి : శ్మశానాలనూ వదలకుండా దోచుకుంటున్నారు: తెదేపా అధినేత చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.