ETV Bharat / city

'విధ్వంసమే వారసత్వంగా జగన్‌ విధానం'

author img

By

Published : Nov 26, 2019, 12:35 PM IST

విధ్వంసమే వారసత్వంగా జగన్‌ విధానం ఉందంటూ తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. రాజధాని అమరావతిని బొత్స శ్మశానంతో పోల్చటం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. రాజధాని నగరాన్ని గౌరవించలేకపోతే కనీసం భూములు ఇచ్చిన రైతుల మనోభావాలనైనా గౌరవించాలని ట్వీట్ చేశారు.

babu
babu
  • రాజధాని అమరావతిని ప్రపంచంలోనే అద్భుత నగరంగా తీర్చిదిద్దాలనేది ప్రతి ఆంధ్రుడి ఆకాంక్ష. తెదేపా హయాంలో రూ.52 వేల కోట్ల విలువైన నిర్మాణాలతో, వేలాది కార్మికులతో కళకళలాడుతూ, పర్యాటక జన సందోహంతో నిత్య సందడిగా ఉండేది. అటువంటి సజీవ స్రవంతి అమరావతిని స్మశానంగా శత్రువు కూడా పోల్చరు. (1/3) pic.twitter.com/95ROd4woRg

    — N Chandrababu Naidu (@ncbn) November 26, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

విధ్వంసమే వారసత్వంగా జగన్‌ విధానం ఉందంటూ తెదేపా అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు. తాజాగా జరుగుతున్న పరిణామాలు ఎంతో బాధ కలిగించాయన్నారు. జగన్‌ గతంతోపాటు భవిష్యత్తునూ చెరిపేస్తూ తరువాతి తరాలకు ఏమీ మిగల్చడం లేదని ఆక్షేపించారు. రాజధాని అమరావతిని బొత్స శ్మశానంతో పోల్చటం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. రాజధాని నగరాన్ని గౌరవించలేకపోతే కనీసం భూములు ఇచ్చిన రైతుల మనోభావాలనైనా గౌరవించాలన్నారు. మహోన్నత నాగరికతపై కనీస గౌరవం ఉండాలన్న చంద్రబాబు... 5 కోట్ల మంది ప్రజలకు గౌరవ మర్యాదలివ్వాలని అన్నారు.

కష్టం అర్థమవుతుందనుకోవడం అత్యాశే

  • I think Botsa Satyanarayana is on dope available near Tadepalli right under the nose of @ysjagan. Or else, why would he make shocking comments comparing Amaravati with a graveyard? Who would stoop to such a low and disrespect the farmers who’ve pooled their lands? (1/2) pic.twitter.com/dUlhJiDqrj

    — Lokesh Nara (@naralokesh) November 26, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడానికి పడిన కష్టం వైకాపా నాయకులకు అర్థం అవుతుందనుకోవడం అత్యాశే అవుతుందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. ల్యాండ్ పూలింగ్ దగ్గర నుంచి రైతుల ప్లాట్లు తిరిగి ఇవ్వడం, మౌలిక వసతుల కల్పన వరకూ అన్నీ దేశంలో ఉత్తమ ఆలోచనలుగా ప్రశంసలు అందుకుంటుంటే.. వైకాపా నేతలు మాత్రం కూర్చున్న చెట్టునే నరికేసుకుంటున్నారని దుయ్యబట్టారు. శ్మశానాలకు పార్టీ రంగులు వేసుకుంటున్న జగన్ అక్కడే ఆగిపోతారని ఊహించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే అమరావతిని, శ్మశానంతో పోల్చి ప్రజా రాజధానిని అవమానపరుస్తున్నారని ట్వీట్ చేశారు.

ఇవి చదవండి:

తెలంగాణలో యువతి హైడ్రామా.. ప్రియుడి దగ్గరికి వెళ్లేందుకు వెరైటీ ప్లాన్​

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.