తెదేపా శ్రేణులు భావోద్వేగానికి గురికావద్దని ఆ పార్టీ అధినేత చంద్రబాబు సూచించారు. అరాచక పాలనపై మనోధైర్యంతో ముందుకెళ్దాం అంటూ పిలుపునిచ్చారు. వైకాపా అరాచకాలను సమర్థంగా ఎదుర్కొందామని అన్నారు. తెదేపా కార్యకర్త ఈడిగ నాగేంద్ర ఆత్మహత్య బాధాకరమన్న చంద్రబాబు.. నాగేంద్ర కుటుంబానికి పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు కలిసికట్టుగా పోరాడదాం అన్నారు.
ఇదీ చదవండి: తొలుత 12 పట్టణాల్లో మధ్య తరగతికి తక్కువ ధరలకే ఇళ్ల స్థలాలు : సీఎం జగన్