ETV Bharat / city

'కరోనా గురించి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉంది'

కాలజ్ఞానంలోని బ్రహ్మంగారి సూక్తులన్నీ భవిష్యత్తులో అక్షర సత్యాలుగా నిరూపితం కావడం తెలిసిందేనని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. ప్రస్తుత కరోనా వ్యాధి గురించి తన కాలజ్ఞానంలో ముందే పేర్కొన్నారని విన్నట్లు చెప్పారు.

author img

By

Published : May 2, 2020, 5:53 PM IST

chandrababu
chandrababu

కరోనా మహమ్మారి గురించి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ముందే పేర్కొన్నారని తాను విన్నట్లు తెలుగుదేశం అధినేత చంద్రబాబు తెలిపారు. ఈశాన్యాన కోనంకి వ్యాధి పుడుతుందని, లక్షలాది మంది బలి అవుతారని చెప్పినట్లుగా కాలజ్ఞానంలో ఉందన్నారు. శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 327 వ ఆరాధనా ఉత్సవాల సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల్లోని విశ్వబ్రాహ్మణులకు, బ్రహ్మంగారి భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. సజీవ సమాధి పొందిన రోజు సందర్భంగా.. ఆరాధనలను లాక్ డౌన్ నేపథ్యంలో ఇళ్లల్లోనే భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని సూచించారు.

బ్రహ్మంగారు గొప్ప కాలజ్ఞాని.. ఆధ్మాత్మిక వేత్త, సంఘ సంస్కర్త, గొప్ప తత్వవేత్తగా చంద్రబాబు కొనియాడారు. తన బోధనల ద్వారా జాతిని జాగృతం చేశారన్నరు. భోగ భాగ్యాల కన్నా, సమాజ హితమే మిన్నగా బోధించారన్నారు. బ్రహ్మంగారు అంటే ఎన్టీఆర్ కు ఎంతో గౌరవాభిమానాలని చెప్పారు. ఆయన జీవిత చరిత్రపై తీసిన సినిమా శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర గొప్ప విజయం సాధించిందని గుర్తు చేశారు. బ్రహ్మంగారి మఠం అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అనేక చర్యలు తీసుకున్నామన్నారు.

ఇవీ చదవండి:

ఆసక్తికర వార్తలు@1PM

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.